వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు మన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రేమను వ్యక్తపరచడంలో ప్రధాన పాత్ర పోషించే ఈ పువ్వు, ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రత్యేకించి వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ, దీని అద్భుతమైన ఔషధ గుణాలను తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
గులాబీ పువ్వు అందమైన రంగుతో పాటు సువాసనతో మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉండటంతో, శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గులాబీ పువ్వును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తగ్గడంతో పాటు, బరువు తగ్గే ప్రక్రియలో కూడా సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు గులాబీ రేకులను ఉపయోగించుకోవచ్చు. పది నుంచి పదిహేను గులాబీ రేకులను నీటిలో నానబెట్టి… ఆ నీటిని మరగబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఈ నీటిలో తేనె ,దాల్చినచెక్క పొడి కలిపి త్రాగితే, వేగంగా ఫలితం పొందొచ్చు. క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే, బరువులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
మొటిమలు సమస్య ఉన్నవారు గులాబీలతో చేసిన ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం పొందుతారు. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని మృదువుగా ఉంచేలా చేస్తాయి. మెంతి విత్తనాలను పొడి చేసి, దానిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పూతగా వేసుకుంటే, మొటిమలు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత ముఖాన్ని రోజ్ వాటర్‌తో కడిగితే, చర్మం తాజాగా మారుతుంది. తాజా గులాబీ, అలోవెరా, తేనెతో కలిపి చేసిన ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం ద్వారా కూడా చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
గులాబీ పువ్వు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంది. ఇది గట్ హెల్త్‌ను మెరుగుపరచి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గులాబీ రేకుల్లోని వాపు నిరోధక లక్షణాలు పొట్టలో వాపును తగ్గించి, గ్యాస్ట్రైటిస్, అల్సర్ సమస్యలను నివారించేందుకు సహాయపడతాయి.
ఇక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గులాబీ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, గులాబీలో ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీని ఆకుల ఆవిరిని పీల్చడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడం వల్ల, మానసిక ఒత్తిడి తగ్గి, ఆనందాన్ని కలిగిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి గులాబీ రేకులు ఎంతగానో సహాయపడతాయి.
విటమిన్ సి అధికంగా ఉండటంతో, ఇనుము శోషణ పెరిగి, శరీరానికి జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందమైన రంగుతో మంత్రముగ్ధులను చేసే గులాబీ పువ్వు, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిన ఈ పువ్వును మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ను సంప్రదించడం మంచిది.
This post was last modified on February 11, 2025 3:41 pm
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…
గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…
ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…