డెల్టా ప్లస్ కి కోవాగ్జిన్ తో చెక్..!

కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ 40వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదంతా థర్డ్ వేవ్ కి సంకేతమే కావచ్చనే భయం కూడా ప్రజల్లో మొదలైంది. ఇప్పటికే.. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది బలయ్యారు.

అనేక మంది ఆస్పత్రులలో చేరి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇంకా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెకండ్ వేవ్ తోనే భయంకరమైన పరిస్థితులను చవి చూశాం. ఇక థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో తాజాగా ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు త్వరగా పెరుగుతున్నాయని భారత దేశంలో వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్లలో కారణంగా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ప్రకటన చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ తో వేసుకోవడం ద్వారా.. అరికట్టవచ్చని స్పష్టం చేసింది ఐసీఎంఆర్. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా ఎదురుకుంటోందని ఐసీఎంఆర్ పేర్కొంది