సైరాకి రెట్టింపయిన క్రేజ్‌

సైరాకి రెట్టింపయిన క్రేజ్‌

ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి మారింది. రొటీన్‌ కమర్షియల్‌ సినిమాల కంటే కథలో, నేపథ్యంలో కొత్తదనం వున్నవాటినే నెత్తిన పెట్టుకుంటున్నారు. రంగస్థలం చిత్రం అంతటి ఘన విజయం సాధించడానికి పీరియడ్‌ సెటప్పే కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాహుబలి చిత్రాన్ని ఎగబడి చూడ్డానికి కూడా ఆ చిత్రం మిగిలిన సినిమాలు అన్నిటికంటే భిన్నంగా వుండడమే కారణం. ఇప్పుడు మహానటి చిత్రాన్ని కూడా విరగబడి చూస్తోన్నది అందుకే.

గత చరిత్రలు, విభిన్న నేపథ్యాలు వున్న చిత్రాలకి ఇప్పుడు కలక్షన్లు వస్తున్నాయి. దీంతో సైరా నరసింహారెడ్డిపై బయ్యర్లలో మరింత నమ్మకం పెరిగింది. బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగలదని ఈ చిత్రంపై బయ్యర్లకి భరోసా పెరుగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌లో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులని మెప్పిస్తుందని నమ్ముతూ భారీ ఆఫర్లతో ముందుకి వస్తున్నారు. రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే మూడొంతుల బిజినెస్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ట్రెండుని క్యాష్‌ చేసుకోవడం కోసం సైరా పనులు వేగవంతం చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే వేసవిని మిస్‌ కాకూడదని చూస్తున్నారు. ఇప్పటికే మే 9 డేట్‌ని టార్గెట్‌ చేసారనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో మార్కెట్‌కి ఏ లోటు వుండదనేది తెలుసు కనుక ఇక తమిళ, హిందీ, మలయాళ మార్కెట్లలో క్రేజ్‌ తీసుకురావడం ఎలా అనే దానిపై చరణ్‌ ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు నిర్మాతలు, పంపిణీ సంస్థలతో అతను చర్చలు కూడా జరిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు