పవన్ చేయనిది సల్మాన్ చేశాడు

పవన్ చేయనిది సల్మాన్ చేశాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదార స్వభావం గురించి.. అతడి సేవా దృక్పథం గురించి సామాజిక మాధ్యమాల్లో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా వల్ల తాను రోడ్డున పడిపోయానంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ నిరాహార దీక్ష చేస్తుంటే అతడి సంగతి పవన్ పట్టించుకోలేదు. ఆ సినిమా దెబ్బకు ఆ డిస్ట్రిబ్యూటరే కాదు.. ఇంకా చాలామంది నష్టపోయారు. వాళ్లలో ఇంకొంతమంది మంది ప్రెస్ మీట్ కూడా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మాత్రమే కాదు.. పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ కూడా బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. మరోవైపు మహేష్ సినిమాలు ‘1 నేనొక్కడినే’.. ‘ఆగడు’.. ‘బ్రహ్మోత్సవం’ కూడా బయ్యర్లను ముంచేశాయి. ఇంకా కొందరు స్టార్ హీరోల సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు దెబ్బ తిన్నారు. ఇక్కడ కాదు.. వేరే ఇండస్ట్రీల్లోనూ పెద్ద హీరోల సినిమాల్ని నమ్ముకున్న బయ్యర్లు దారుణంగా దెబ్బ తిన్న పరిస్థితి ఉంది. ఐతే బయ్యర్ల నష్టాన్ని హీరోనో.. నిర్మాత కొంతమేర భర్తీ చేయడం అన్నది అరుదుగా జరుగుతుంటుంది. తమిళంలో రజినీకాంత్ ఒక్కడు కొన్ని సినిమాలకు నష్టం భరించాడు.

ఆ తర్వాత ఇప్పుడు సల్మాన్ ఖాన్ మాత్రమే ఈ సాహసం చేశాడు. తన కొత్త సినిమా ‘ట్యూబ్ లైట్’ వల్ల బయ్యర్లు నష్టపోయిన దాంతో చాలా వరకు భర్తీ చేశాడు సల్మాన్. రూ.32.5 కోట్ల దాకా సల్మాన్ బయ్యర్లకు తిరిగి చెల్లించినట్లు సమాచారం. ఇది చాలా పెద్ద మొత్తమే. ఇలా చేయడం ద్వారా సల్మాన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. అతడిపై బయ్యర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే సల్మాన్ చేసిన పని ఇండస్ట్రీ జనాలకు మాత్రం రుచించట్లేదు. సల్మాన్ చేశాడు కాబట్టి.. ఇకపై తాము కూడా ఇలా చేయక తప్పదని.. బయ్యర్లు కూడా సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారీ పరిహారం కోసం డిమాండ్ చేస్తారని.. ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. సినిమాలకు లాభాలు వచ్చినపుడు నిర్మాతకు అదనపు డబ్బులేమీ ఇవ్వనపుడు.. నష్టాలొస్తే మాత్రం ఎందుకు భరించాలన్నది వీళ్ల వాదన. ఐతే స్వల్ప నష్టాలైతే పర్వాలేదు కానీ.. నష్టం భారీగా ఉన్నపుడు వాళ్లను కొంచెం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నది అంగీకరించాల్సిన విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు