గత ఆరు నెలల్లో వివిధ భాషల నుంచి అనేక కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అందులో అమితాబ్ బచ్చన్ నటించిన ‘గులాబో సితాబో’ ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’ ఉంది. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన ‘పొన్‌మగల్ వందాల్’ ఉంది.
మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చిత్రం ‘సీ యూ సూన్’ కూడా ఇలాగే విడుదలైంది. తెలుగులోకి వచ్చేసరికి నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’తో పాటుగా కొన్ని చిన్న చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజయ్యాయి. ఐతే ఈ మొత్తం చిత్రాల వరస చూస్తే.. దాదాపుగా అన్నీ క్లాస్‌గానే కనిపిస్తాయి.
మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చిత్రాలే ఓటీటీలో విడుదలవుతూ వచ్చాయి. ఈ ఫ్లాట్ ఫామ్‌లో పూర్తి స్థాయి మాస్ సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ఆ లోటును తీర్చే సినిమా అవుతుందని ‘లక్ష్మీబాంబ్’ మీద ఆశలు పెట్టుకున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ రూపొందించిన చిత్రం ‘లక్ష్మీబాంబ్’. ఇది సౌత్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ హార్రర్ కామెడీ ‘కాంఛన’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దాదాపు రూ.90 కోట్లకు హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి.
ఇప్పటికే దిల్ బేచారా సహా కొన్ని పెద్ద సినిమాలను రిలీజ్ చేసిన హాట్ స్టార్.. ‘లక్ష్మీబాంబు’ విషయంలో మాత్రం ఆలస్యం చేస్తోంది. ఊరిస్తూ వస్తోంది. ఐతే మంచి సందర్భం చూసి ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయాలన్నది ఆ సంస్థ ఉద్దేశం. అందుకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.
‘లక్ష్మీ బాంబ్’ను పేల్చడానికి దీపావళి కంటే మంచి సందర్భం మరొకటి ఉండదన్నది ఆ సంస్థ ఉద్దేశం. నవంబరు 14న దీపావళి కాగా.. ముందు రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా కొంత టాకీ పార్ట్ మిగిలుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయట. ప్రస్తుతం ‘బెల్ బాటమ్’ కోసం యూరప్‌లో ఉన్న అక్షయ్.. త్వరలోనే స్వదేశానికి వచ్చి ‘లక్ష్మీబాంబ్’ పని పూర్తి చేస్తాడట.
"తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం." ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి…
నిన్న రాత్రి నుంచి ఏపీ తెలంగాణలో అఖండ 2 తాండవం థియేటర్లు జనాలతో నిండుగా కళకళలాడుతున్నాయి. సినిమా ఎలా ఉంది,…
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వరుసగా పెట్టే వాట్సాప్ స్టేటస్లు, స్థానిక నేతలపై తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో…
విశాఖపట్నం ఐటీ మ్యాప్పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి…
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…