ఎంత ఒకే ఫ్యామిలీ బంధువులు అయినంత మాత్రాన ఇద్దరు హీరోలు లేదా స్టార్లు కలిసి ఒక సినిమా చేసే పరిస్థితులు టాలీవుడ్ లో లేవు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్స్ లో చూపించే కథను ఏ దర్శకుడు రాయలేకపోయాడు. బాలయ్య తారక్ లను ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న నందమూరి అభిమానుల కోరిక తీరడం కష్టమే. ఎవరిదాకో ఎందుకు అప్ కమింగ్ స్టేజిలో ఉన్న సాయి ధరమ్ తేజ్, కొత్తగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్ లు స్క్రీన్ పంచుకోవడం ఎప్పటికి జరిగేనో. వీటికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ముఖ్యమైంది ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోననే భయం.
అలాంటి కాంబినేషన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయిక కూడా ఉంది. ఈ కాంబోలో ఎవడు చేశారు కానీ కథ ప్రకారం ఇద్దరు వేసింది ఒకే పాత్ర కాబట్టి సింగల్ ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ దక్కలేదు. అప్పటికి ఇప్పటికి ఇద్దరి స్టార్ డంలో చాలా మార్పు వచ్చింది. ఆర్ఆర్ఆర్ వల్ల చరణ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటే పుష్ప పార్ట్ 1 రూపంలో తెలుగు కంటే ఎక్కువ నార్త్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు బన్నీ. అలాంటిది ఇద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. దానికి ఛాన్స్ ఉందంటున్నారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.
అలీతో నిర్వహించిన టాక్ షోలో చరణ్ బన్నీలతో కలిసి తన స్వంత బ్యానర్ మీద ఒక మల్టీ స్టారర్ తీయాలని ప్లాన్ ఉందని, అందుకే చరణ్ అర్జున్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించి ప్రతి సంవత్సరం డబ్బులు కట్టి రెన్యూవల్ చేయిస్తున్నానని చెప్పేశారు. అయితే కథ సిద్ధంగా లేదు. ఎవరైనా వీళ్ళను రాజమౌళి రేంజ్ లో హ్యాండిల్ చేసే దర్శకుడు దొరికితే అప్పుడు చేస్తారన్న మాట. సో అభిమానులు దీని కోసం ఎదురు చూడొచ్చు. ఎప్పుడో తొంబై దశకంలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లు కరణ్ అర్జున్ అనే సూపర్ డూపర్ హిట్ వచ్చింది. ఇప్పుడు అదే సౌండ్ లో చరణ్ అర్జున్ కూడా వస్తే రికార్డులు బద్దలే
This post was last modified on October 18, 2022 6:46 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…