ఫ్యాషన్ ప్రపంచంలో డిజైనర్లు ఎప్పటికప్పుడు సరికొత్త డ్రెస్సులతో తమ క్రియేటివిటీని చాటుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ప్రపంచంలోని అందమైన మోడల్స్, నటీమణులు, సెలబ్రిటీలు తమ డిజైనర్ దుస్తులను ధరించాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంలో రోజుకు కొత్త ఆవిష్కరణకు డిజైనర్లు ప్రయత్నిస్తుంటారు. ఆ దిశగా తాజాగా ప్రయోగాత్మకంగా ఓ సరికొత్త డ్రెస్ ను ఫ్యాబ్రికన్ కంపెనీ రూపొందించింది.
ఇప్పటివరకు డిజైనర్ దుస్తులను ఫ్యాక్టరీలలోను, షాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ డిజైన్ చేయడం చూశాం…కానీ, తాజాగా ఆ కంపెనీకి చెందిన డిజైనర్లు లైవ్ లో ఓ వేదికపైనే సరికొత్త డ్రెస్ ను డిజైన్ చేశారు. అది కూడా ప్రముఖ మోడల్ బెల్లా హడిడ్ ఒంటిపై ఫ్యాబ్రిక్ స్ప్రేను(పాలిమర్) స్ప్రే చేసి దానితోనే డ్రెస్ ను తయారు చేయడం విశేషం. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా వేదికపైనే బెల్లా శరీరంపై ఆ స్ప్రే ను స్ప్రే చేస్తూ స్ప్రే ఆన్ గౌన్ తయారుచేశారు.
వారు స్ప్రే చేసిన కొద్దిసేపటి తర్వాత ఆ పాలిమర్ స్ప్రే డ్రెస్ గా మారిపోయింది. మోడల్ శరీరాకృతి, సైజులకు అనుగుణంగా అప్పటికప్పుడు డ్రెస్సులు తయారుచేసేందుకు వీలుగా ఈ సరికొత్త ఫ్యాబ్రిక్ టెక్నాలజీని రూపొందించామని ఆ సంస్థ చెబుతోంది. ఇక, ఆరిపోయిన తర్వాత పాలిమర్ తో రూపొందించిన ఆ డ్రెస్సుకు సాగే గుణం కూడా ఉంటుందని, అది స్ట్రెచబుల్ అని వారు చెప్తున్నారు.
స్టేజిపై లైవ్ లోనే ఒక మోడల్ శరీరంపై డ్రెస్ రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఈ ఫ్యాబ్రిక్ స్ప్రే డ్రెస్సు సరికొత్త ట్రెండుకు పలికింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే…అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on October 3, 2022 3:06 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…