ఈ మధ్యే ఓ హైదరాబాదీ పైలట్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న తన భార్యను ఇంట్లో గొడ్డును బాదినట్లు బాదుతున్న వీడియో ఒకటి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ వ్యక్తి శాడిజానికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నాక వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ తాలూకు వీడియో అది.
ఇప్పుడు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ మహిళను అందులోనే పని చేసే ఓ వ్యక్తి దారుణంగా కొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనం రేపుతోంది. ఇది ఆంధ్ర్రపదేశ్‌లోని నెల్లూరు నగరంలో ఓ ప్రభుత్వ ఆఫీసులో జరిగింది. ఆ వ్యక్తి మాస్కు పెట్టుకోకుండా ఆఫీసుకు వస్తుండటం పట్ల ఆ మహిళ ప్రశ్నించిందని.. దీంతో అతడికి కోపం వచ్చి ఆమెపై దాడి చేశాడని అంటున్నారు. నేరుగా ఆఫీసులోకి వచ్చి ఆమె మీద అతను విరుచుకుపడ్డాడు.
పక్కనే రాడ్ లాంటిది కనిపిస్తే దాన్ని తీసుకుని ఆమెపై దాడి చేశాడు. తోటి సిబ్బంది వచ్చి విడిపించే ప్రయత్నం చేసినా ఆమెను కొడుతూనే ఉన్నాడు. మహిళ అని చూడకుండా మరీ విచక్షణా రహితంగా కొట్టడం దారుణం. ఆ మహిళ వికలాంగురాలని అంటున్నారు. ఇదే నిజమైతే అది మరీ అన్యాయం.
ఈ వీడియో ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో పెట్టి ఏపీ ప్రభుత్వ అధికారులు, పోలీసులను ట్యాగ్ చేశారు నెటిజన్లు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ వీడియో చూసి స్పందించారు. ఈ ఉదంతం దారుణమని.. దాడి చేసిన ఆ వ్యక్తిని వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని.. అతడిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి దర్యాప్తు చేస్తారని.. బాధితురాలికి న్యాయం జరుగుతుందని.. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని పేర్కొన్నారు.
This post was last modified on July 1, 2020 10:51 am
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం మాట ఎలా ఉన్నా.. నాయకులను బలోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ పరిచేందుకు…