Uncategorized

సుశాంత్ లేడు.. ఫాలోవర్లు 20 లక్షలు పెరిగారు

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మూడు రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతడి అభిమానులతో పాటు అందరినీ కలచివేసింది. అతడికి మద్దతుగా సోషల్ మీడియాలో మూడు రోజులుగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. వారసులు, వారి మద్దతుదారులతో కూడిన బాలీవుడ్ మాఫియానే సుశాంత్ ఆత్మహత్యకు కారణమంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.

బాలీవుడ్లో వారసులు నెత్తిన పెట్టుకుని ప్రమోట్ చేస్తాడని పేరున్న కరణ్ జోహార్ మీద వాళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు రోజుల వ్యవధిలో కరణ్ జోహార్ ఫాలోవర్లు లక్ష మందికి పైగా తగ్గిపోవడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి నిదర్శనం. ఐతే ఇదే సమయంలో సుశాంత్ ఫాలోవర్లు అనూహ్యంగా పెరిగారు.

కేవలం మూడు రోజుల వ్యవధిలో సుశాంత్ ఇన్‌స్టా అకౌంట్లో 20 లక్షలకు పైగా కొత్త ఫాలోవర్లు జమ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. సుశాంత్ చనిపోవడానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫాలోవర్ల సంఖ్య 9.7 మిలియన్లు. ఐతే గత మూడు రోజుల్లో ఆ సంఖ్య ఏకంగా 11.8 మిలియన్లకు పెరిగింది. 20 లక్షల మందికి పైగానే ఈ మూడు రోజుల్లో కొత్త ఫాలోవర్లు వచ్చారు సుశాంత్‌‌కు. ఇప్పుడు సుశాంత్ అనేవాడే లేకున్నా.. అతడి నుంచి కొత్తగా ఏ అప్‌డేట్ రాదని తెలిసినా తన అకౌంటును కొత్తగా ఇంతమంది ఫాలో కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇది అతడికి సంఘీభావంగా నెటిజన్లు చూపిస్తున్న ప్రేమగా చెప్పొచ్చు. ఎవరైనా సుశాంత్ సన్నిహితులు ఈ అకౌంట్‌ను టేకప్ చేసి.. తన వ్యక్తిగత ఫొటోలు, ఇతర విశేషాలతో ఈ అకౌంట్‌ను మేనేజ్ చేసే అవకాశముంది. శ్రీదేవి సహా కొందరు దివంగత నటీనటుల అకౌంట్లను ఇలాగే వారి కుటుంబ సభ్యులు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on June 17, 2020 4:28 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

10 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago