కీవ్ లో విధ్వంసం సృష్టించిన రష్యా

ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను ముమ్మరం చేసింది. యుద్ధం మొదలైన ఆరో రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో చాలా ప్రాంతాల్లో రష్యా సైన్యం విధ్వంసం సృష్టించింది. కీవ్ లోని టెలివిజన్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే ఎన్నో భవనాలను నేలమట్టం చేశాయి. యధేచ్చగా బాంబులు, క్షిపణలను ప్రయోగించటంతో మామూలు జనాలు కూడా భయపడిపోతున్నారు.

చివరకు బంకర్లలో దాక్కున్న ప్రజల్లో కూడా టెన్షన్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే భోజనం కోసమో లేకపోతే మంచినీళ్ళ కోసమో బయటకు వస్తున్న జనాలు రష్యా దళాల దాడుల్లో చనిపోతున్నారు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ ఇలాగే మరణించాడు. రష్యా సైన్యం చేతిలో మరణించిన మొదటి భారతీయ విద్యార్థి. ఉక్రెయిన్లోని కీలకమైన కీవ్, ఖర్కీవ్ నగరాలపై రష్యా 56 బాంబులు , 120 క్షిపణలను ప్రయోగించటంతో ప్రభుత్వ భవనాలతో పాటు జనావాసాలు కూడా ధ్వంసమైపోయాయి.

ఉక్రెయిన్ సైన్యం జనావాసాల్లో ఉండటంతో రష్యా దళాలు కూడా జనావాసాలపైనే దాడులు మొదలు పెట్టింది. దీని ఫలితంగానే ఉక్రెయిన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 350 మంది చనిపోయారు. కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న ఖర్కీవ్ నగరాన్ని తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిటం గమనార్హం.

ఇదే సమయంలో రష్యాకు ఎట్టిపరిస్దితిల్లోను లొంగేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు. చివరి వరకు తాము రష్యాపై పోరాటం చేస్తునే ఉంటారని ప్రకటించారు. రష్యా సైనికులు సుమారు 5 వేల మందిని చంపేసినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు చెప్పారు. ఉక్రెయిన్ నగరాలపై క్లస్టర్ బాంబులను రష్యా ప్రయోగిస్తున్నట్లు సమాచారం. రష్యా సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైన్యానికి జనాలు కూడా మద్దతుగా నిలిచారు. రష్యా సైన్యంపై ప్రజలు కూడా తుపాకులతో కాల్పులు జరుపుతున్నారు. అలాగే పెట్రోల్, డీజల్ బాంబులతో దాడులు జరుపుతున్నారు. రష్యా దాడుల తీవ్రతను పెంచుతున్నది కాబట్టే మొదటి విడత చర్చలు పెద్దగా ఫలించలేదు.