ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారంపై టాలీవుడ్ హీరోల్లో వైఖరేంటో అర్థం కాక ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్య ఇండస్ట్రీనే సంక్షోభంలోకి నెడుతోందని తెలుస్తున్నప్పటికీ చాలామంది దీనిపై నోరు విప్పట్లేదు. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం లేదు కానీ.. ఇండస్ట్రీ ఇబ్బందిని కూడా సరిగా చెప్పలేకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, సురేష్ బాబు, నాని లాంటి వాళ్లు తప్ప ఈ విషయంలో నిజాయితీగా స్పందించలేదనే అభిప్రాయం ఇండస్ట్రీ నుంచే వ్యక్తమవుతోంది.
ఐతే వీరిలో ఒక్కొక్కొరు ఒక్కో రకంగా తమ భావాన్ని వ్యక్తం చేశారు. కానీ అంతిమగా వాళ్లందరూ సమస్య తీవ్రతను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీరిలా ఇండస్ట్రీ వైపు నిలబడకపోగా.. ఇండస్ట్రీని తప్పుబట్టేలా మొన్న మోహన్ బాబు, ఇప్పుడు నాగార్జున మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వీళ్లిద్దరిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరిపై నెటిజన్లలో ఇంత వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యం కలిగించే స్థాయిలో మొన్న మోహన్ బాబుపై, ఇప్పుడు నాగార్జునపై విమర్శల వర్షం కురుస్తోంది.
టికెట్ల ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అనుకుంటే.. మోహన్ బాబు ఆశ్చర్యకరంగా ఇండస్ట్రీ జనాలనే నిలదీస్తూ లేఖ రాయడంతో విమర్శల పాలయ్యారు. అంతిమంగా వివిధ సమస్యలపై సమావేశాలను తనను పిలవకపోవడాన్ని నిరసిస్తున్నట్లుగా ఆయన స్వరం వినిపించారు. ఎవరో పిలవడం ఏంటి.. మీరే లీడ్ తీసుకొని ఉండొచ్చు కదా అనే ప్రశ్నలు ఆయనకు ఎదురయ్యాయి. ఇక ఏపీ సీఎంకు సన్మానం చేద్దాం, ఆయన్ని వేడుకుని సమస్యను పరిష్కరించుకుందాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం చాలామందికి రుచించలేదు.
మోహన్ బాబు లేఖ తాలూకు ట్వీట్ కింద చూసినా.. ఆయన పేరు ట్రెండ్ అయిన తీరు చూసినా ఆయనపై సోషల్ మీడియాలో ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో అర్థమైపోతుంది. ఇప్పుడు నాగార్జున ఇంతకుమించిన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. జగన్‌తో ఉన్న స్నేహం, వ్యాపార బంధం మూలంగానే నాగ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టకుండా, ప్రశ్నించకుండా.. అసలు తగ్గించిన టికెట్ల రేట్లతో తనకు సమస్యే లేదన్నట్లుగా మాట్లాడారంటూ ఆయన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. రోశయ్య సీఎంగా ఉన్న టైంలో ‘రగడ’ సినిమా ఆడియో వేడుక సందర్భంగా ఆయన ఆ వేదిక మీది నుంచే పైరసీ మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని తీవ్ర స్వరంతో మాట్లాడారు. తమ దగ్గర 50-60 శాతం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసుకుని జేబుల్లో వేసుకుంటూ, తమ సమస్య పరిష్కారానికి ఏమీ చేయట్లేదన్నారు. ఐతే అప్పుడు సినిమా వేడుకలో అలా మాట్లాడి ఇప్పుడేమో ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడను, మాట్లాడటం తప్పు అనడం ఏంటంటూ ఆ వీడియో పెట్టి నాగ్‌ను నిలదీస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on February 19, 2022 3:52 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…