ఆ ఫ్యామిలీకి రూ.7.35 కోట్లను ఎయిరిండియాను ఇవ్వమన్న సుప్రీం

ఒక ప్రయాణికుడి కుటుంబానికి రూ.7.35 కోట్ల పరిహారాన్ని ఎయిరిండియా ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విమాన ప్రమాదంలో మరణించినకుటుంబానికి ఈ మొత్తాన్ని ఇవ్వాలంది. ఇంత మొత్తాన్ని ఆ కుటుంబానికి ఎందుకు ఇవ్వాలని సుప్రీం చెప్పిందన్న విషయంలోకి వెళితే.. 2010లొ మంగళూరులో ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

దుబాయ్ నుంచి 166 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన వారిలో 158 మంది ప్రాణాల్ని కోల్పోయారు. ఇలా ప్రాణం విడిచిన వారిలో యూఏఈకి చెందిన ఒక సంస్థ రీజనల్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయన పేరు మహేంద్ర. నలభై ఐదేళ్ల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఎయిరిండియా తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని కోరింది.

ఇదే విషయాన్ని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కూడా వెల్లడించింది. ఈ పరిహారాన్ని చెల్లించేందుకు ఎయిరిండియా ముందుకు రాలేదు. దీంతో మహేంద్ర కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు.. ఆ వ్యక్తి చేసే ఉద్యోగం స్థాయి ఆదారంగా అతని ఆదాయాన్ని పరిగణించాలని పేర్కొంది. ఇందులో భాగంగా రూ.7.35 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని.. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకుంటే ఏడాదికి తొమ్మిది శాతం చొప్పున వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొన్నారు.