పొల్యూషన్ పుణ్యమా అని నగరాల్లో.. మహానగరాల్లో ముఖానికి గుడ్డలు కట్టుకొని వెళ్లటం చూశాం. మాయదారి రోగం పుణ్యమా అని.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా బయటకు వచ్చే వారెవరైనా సరే.. మాస్కులు ధరించాలన్న నియమాన్ని పెట్టటమే కాదు.. దాన్ని ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయిలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయమే కాదు.. ప్రాణాలకు ప్రమాదంగా మారే మాయదారి రోగం బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్కులు ధరించటం ఇప్పుడు అందరూ ఒక అలవాటుగా చేసుకున్నారు. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు పెడితే చాటు.. ముఖానికి ఏదో ఒకటి అడ్డుగా పెట్టుకోవటం ఇప్పుడు మామూలైంది. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది.
రానా దగ్గుబాటి.. మిహీకా బజాజ్ జరిగిన రోకా వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్ మెంట్ తరహాలోనే నార్త్ స్టైల్ లో రోకా వేడుక జరిగింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ ప్రోగ్రాంలో మాస్కుల ముచ్చటే కనిపించలేదంటున్నారు.
పరిమిత సంఖ్యలో ప్రోగ్రాం జరగటం.. వేడుకలో ఉన్నోళ్లంతా కుటుంబ సభ్యులే కావటంతో మాస్కులు కనిపించలేదని చెబుతున్నారు. ఏమైనా.. ఇటీవల కాలంలో మాస్కులు లేకుండా నలుగురు కలిసి ఉండటం మాత్రం ఇదే తొలిసారన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on May 22, 2020 12:25 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…