దక్షిణాది స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన శంకర్ ఈ మధ్యకాలంలో వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ సినిమాను మొదలుపెట్టారాయన. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. సెట్స్ లో జరిగిన ప్రమాదంలో టెక్నీషియన్స్ మరణించడం, తరువాత కమల్ ఎన్నికల్లో బిజీ అవ్వడం ఇలా పలు కారణాల వలన షూటింగ్ ఆగిపోయింది.
లైకా ప్రొడక్షన్స్ ఎంతసేపటికీ షూటింగ్ పునః ప్రారంభించకపోవడంతో శంకర్ తన తదుపరి సినిమాలను అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా అలానే రణవీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ రీమేక్ లను ప్లాన్ చేశారు. దీంతో లైకా సంస్థ శంకర్ పై కేసు పెట్టింది. తమ సినిమా పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమా చేయడానికి వీళ్లేదని లైకా వాదిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. వచ్చే నెలలో ఈ కేసుపై కోర్టు తీర్పు ఇవ్వనుంది.
ఇదిలా ఉండగా.. శంకర్ ప్రస్తుతం తన కూతురు పెళ్లి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ కి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు అదితి శంకర్ కు గతేడాది నిశితార్థం జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో కూతురి పెళ్లి ఖాయం చేశారు శంకర్. తమిళనాడులోని పొల్లాచిలో అదితి వివాహం జరగనుంది. వచ్చే వారంలో శంకర్ కుటుంబం మొత్తం పొల్లాచికి వెళ్లనుంది. ఇప్పటికే శంకర్ పొల్లాచి చేరుకొని అక్కడ పనులు చూసుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on June 22, 2021 6:05 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…