జనసేనలోకి చిరంజీవి.. నాగబాబు ఏమన్నాడంటే?

చాలా పెద్ద లక్ష్యాలతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు పొందాక రెండేళ్లు తిరక్కుండానే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించిన చిరు.. చివరికి ఆ రెండు బాధ్యతలూ ముగిశాక రాజకీయాలకే సెలవిచ్చేసిన సంగతి తెలిసిందే.

మూడేళ్ల కిందట సినీ రంగంలోకి పున:ప్రవేశం చేసిన చిరు.. అప్పట్నుంచే సినిమాలే తన లోకం అన్నట్లుగా ఉంటున్నాడు. రాజకీయాల ఊసే ఎత్తట్లేదు. ఐతే గత ఏడాది ఎన్నికల సందర్భంగా తమ్ముడికి, జనసేన పార్టీకి మాట మాత్రమైనా మద్దతు పలకకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాత్రం జనసేనకే తన మద్దతు అని.. తమ కుటుంబంలో రెండు పార్టీలు ఉండబోవని చిరు స్పష్టమైన ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలో చిరు జనసేనలోకి వస్తారా అన్న ఒక ప్రశ్న అభిమానుల్లో ఉదయించింది. చిరు తమ్ముడు నాగబాబు నిర్వహించే యూట్యూబ్ ఛానెల్లో ఆయనకు ఓ అభిమాని నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.

దానికి ఆయన బదులిస్తూ.. ‘‘చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అనేక కారణాల వల్ల ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా సేవలందించారు. చివరికి ఈ రాజకీయాలు నాకొద్దు అని తిరిగి సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక తన అనుభవాన్నంతా సినీ రంగానికే ఉపయోగించాలనుకున్నారు. ఆయన పూర్తి సినిమాలకే అంకితం అయిపోయారు.

ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రాజకీయాల వైపు వెళ్లొద్దన్నది ఆయన ఉద్దేశం. దానికి కట్టుబడే ఉంటారని నా నమ్మకం. ఒకసారి రాజకీయాలు వద్దు అని బలంగా నిర్ణయించుకున్నాక జనసేనలోకి కూడా ఆయన రారు. ఆ పార్టీలో చేరినా రాజకీయాల్లోకి వచ్చినట్లే కదా. కాబట్టి రారని నా ఉద్దేశం. మరి ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. కానీ నాకైతే ఆయన రాజకీయాల్లోకి పున:ప్రవేశం చేయరనే అనిపిస్తోంది’’ అని స్పష్టం చేశాడు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

38 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago