‘మహానటి’తో దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తన వైపు తిరిగి చూసేలా చేసిన నటి కీర్తి సురేష్. ఆ చిత్రం ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద విజయం సాధించింది. కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను బాగానే చూశారు. కీర్తికి ఈ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడంతో ఉత్తరాది వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు.
ఈ గుర్తింపుతో కీర్తికి హిందీలోనూ ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే.. మైదాన్. హైదరాబాద్‌కు చెందిన ఓ లెజెండరీ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేస్తుండగా.. ఆయన సరసన కీర్తిని ఎంచుకున్నారు. సినిమా మొదలైనపుడు అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా-లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికే ఈ చిత్రం పూర్తి కావాల్సింది కూడా.
కరోనాతో బ్రేక్ పడ్డ ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు తాజాగా కీర్తి వెల్లడించింది. తన కొత్త చిత్రం ‘మిస్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించింది. కారణాలు చెప్పలేదు కానీ.. ఆ సినిమాలో తాను భాగం కాదని మాత్రం తెలిపింది. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించబోతుండటం చాలా ఉద్వేగంగా ఉన్నట్లు చెప్పింది కీర్తి.
తమిళంలో రజనీకాంత్ సరసన ‘అన్నాత్తె’లో ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపింది. మరో రెండు పెద్ద సినిమాలు చర్చల దశలో ఉన్నాయంది. ‘మహానటి’ తర్వాత తాను విని ఓకే చేేసిన తొలి కథ ‘మిస్ ఇండియా’దే అని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతోనే తాను బాగా బరువు తగ్గాల్సి వచ్చిందని చెప్పింది కీర్తి. మంగళవారం అర్ధరాత్రి నుంచే ‘మిస్ ఇండియా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
This post was last modified on November 3, 2020 10:30 pm
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…