Mahesh babu, Sukumar, Allu Arjun
సుకుమార్ కొత్త సినిమా ‘పుష్ప’ కథను ముందు మహేష్ బాబు కోసమే తయారు చేసిన సంగతి తెలిసిందే. కానీ అనివార్య కారణాల వల్ల వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమా చేయలేకపోయారు. మహేష్ నో చెప్పాక కథలో కొన్ని మార్పులు చేసి అల్లు అర్జున్‌ను లైన్లోకి తీసుకున్నాడు సుక్కు.
ఈ మధ్యే రిలీజైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమాకు బన్నీనే కరెక్ట్ అనే అభిప్రాయం ఏర్పడింది. మహేష్ ఇది చేయకపోవడం మంచిదే అనుకున్నారు. కానీ దీని కంటే ముందు మహేష్ కోసం సుక్కు వేరే కథ అనుకోవడం విశేషం.
దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సుక్కు. ‘రంగస్థలం’ రిలీజ్ తర్వాత ఏ సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నపుడు సుక్కు దృష్టి తెలంగాణ సాయుధ పోరాటం మీద పడింది. కొన్ని నెలల పాటు దీనికి సంబంధించి అనేక పుస్తకాలు చదివారు సుక్కు.
అప్పట్లో సుక్కు తెలంగాణ సాయుధ పోరాటం మీద విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఆయన సన్నిహితులు కొందరు మీడియాకు వెల్లడించారు. మొత్తం చదివాక కొంత మేర స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. ఒక ఎమోషనల్ ఎపిసోడ్ చుట్టూ కథను అల్లారు. ఆ కథతోనే మహేష్‌తో సినిమా చేయాలని ఒక దశలో అనుకున్నాడు సుక్కు.
కానీ చాలా సుకుమారంగా, రిచ్‌గా కనిపించే మహేష్‌తో తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సినిమా తీస్తే వర్కవుట్ కాదని కొందరు సలహా ఇవ్వడంతో కొత్త కథ కోసం అన్వేషణ జరిగింది. ఆ క్రమంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో కథ ఖరారైంది. కానీ చివరికి ఈ కథ కూడా మహేష్‌కు సెట్ అవుతుందో కాదో అన్న సందేహాలు కలిగాయి.
సుకుమార్ రెడీగా ఉన్నప్పటికీ మహేష్‌కే డౌట్లు కొట్టి.. ఈ సినిమాతో ఉన్న కష్ట నష్టాల్ని బేరీజు వేసుకుని దీన్నుంచి తప్పుకున్నాడు. తర్వాత బన్నీ లైన్లోకి వచ్చాడు. తెలంగాన సాయుధ పోరాటం మీద సుక్కు దగ్గర స్క్రిప్టు రెడీగా ఉన్న నేపథ్యంలో రేప్పొద్దున విజయ్ దేవరకొండ లాంటి హీరోను పెట్టి ఈ సినిమా తీసినా తీయొచ్చేమో.
This post was last modified on April 29, 2020 4:25 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…