Trends

టాటా వంశ వృక్షం.. దేశానికి ఆ కుటుంబం చేసింది ఇదే!

భారతదేశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కానీ.. వేళ్ల మీద లెక్క పెట్టే కుటుంబాలకు ఉండే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కావు. తమ పని తాము చేసుకుంటూ.. దేశాన్ని ఎదిగేలా చేయటంలో టాటా ఫ్యామిలీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. వ్యాపారాలు చేసే వారు భారతదేశంలో కొదవ లేదు. కోట్లాది మంది ఉన్నా.. టాటా కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలు మరెవరికీ దక్కవన్నది అతిశయోక్తి కానే కాదు. నింగికి ఎగిసిన రతన్ టాటా ఉదంతం గురించి తెలిసినంతనే యావత్ దేశంలో విషాద ఛాయలు కమ్మేశాయి. దేశంలోని ప్రతి ఇల్లు ఏదో రకంగా టాటా కుటుంబ వ్యాపారాల్లో ముడిపడి ఉంటుంది. అంత భారీ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించినప్పటికీ సాదాసీదాగా ఉండే లక్షణం కోట్లాది మంది మనసుల్లో ఆయన నిలిచిపోయారు.

ఇంతకూ టాటా కుటుంబం మొదలు ఎక్కడి నుంచి? వారి ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంటుంది? అందులో ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేశారు? లాంటి ప్రశ్నలెన్నో. వాటికి సమాధానం కోసం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇంతకూ టాటాల కుటుంబాన్ని ఎక్కడి నుంచి షురూ చేయాలన్నది చూస్తే.. కాలచక్రంలో దశాబ్దాల వెనక్కి వెళితే కానీ విషయంపై పూర్తి అవగాహన కలుగుతుంది.

టాటా గ్రూపులో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలో దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతకు మించిన మరో విశేషం ఉంది. అదేమంటే.. టాటా గ్రూపు 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. అంటే.. దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కంపెనీకి నిన్నటివరకు అధిపతిగా ఉన్న రతన్ టాటా నింగికెగిశారు. వారి కుటుంబ వంశ వృక్షాన్ని చూస్తే.. పలువురు పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు.

ఈ కుటుంబ వ్యాపారానికి పునాది వేసింది రతన్ దొరబ్ టాటా అయితే.. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం రతన్ టాటాదే. ఇక.. వంశవృక్షాన్ని చూస్తే..

రతన్ దొరబ్ టాటా

  • టాటా వ్యాపార వంశ వృక్షానికి పునాది వేసింది ఈయనే. వీరికి ఇద్దరు సంతానం.
  • 1. బాయి నవాజ్ బాయి రతన్ టాటా
  • 2. నుస్సర్వాన్ జీ రతన్ టాటా
  • నుస్సర్వాన్ జీ పార్సీ పండితుడు. ఈ కుటుంబం నుంచి వ్యాపారంలోకి అడుగు పెట్టిన మొదటి వ్యక్తి.
  • 1822లో జన్మించిన ఆయన 1886లో మరణించారు.
    జంషెడ్జీ టాటా
  • ముందు పేర్కొన్నట్లుగా నుస్సర్వాన్ జీ టాటాకు ఐదుగురు సంతానం.
  • వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా ఒకరు. ఆయనే టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు
  • టాటా గ్రూపులోని స్టీల్.. హోటళ్లు లాంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు.
  • ఆయన్ను బారతీయ పరిశ్రమ పితామహునిగా పేర్కొంటారు.
  • ఆయన 1839లో జన్మించి 1904లో మరణించారు.
    దొరబ్జీ టాటా
  • జంషెడ్జీ టాటా పెద్ద కొడుకు. ఆయన తర్వాత టాటా గ్రూపు వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు.
  • 1859లో పుట్టిన ఆయన 1932 వరకు బతికి ఉన్నారు.
  • టాటా పవర్ వ్యాపారాన్ని నెలకొల్పడంలో కీ రోల్ ప్లే చేశారు.
    రతన్ జీ టాటా
  • జంషెడ్జీ టాటా చిన్న కొడుకు.
  • 1871లో పుట్టిన ఆయన 1918 వరకు బతికి ఉన్నారు.
  • టాటా గ్రూపునకు పత్తి.. వస్త్ర పరిశ్రమ లాంటి వ్యాపారాల్ని జోడించారు
    జేఆర్ డీ టాటా
  • అందరూ జే ఆర్ డీ టాటాగా పేర్కొనే ఆయన పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా.
  • 1904లో పుట్టిన ఆయన 1993 వరకు బతికి ఉన్నారు.
  • రతన్ జీ – సుజానే బ్రియర్ ల కొడుకు.
  • 50 ఏళ్లకు పైనే టాటా గ్రూపునకు ఛైర్మన్ గా ఉన్నారు.
  • టాటా ఎయిర్ లైన్స్ ను ప్రారంభించింది ఆయనే. ఎయిర్ ఇండియా పేరుతో వ్యాపారాన్ని షురూ చేశారు.
    నావల్ టాటా
  • రతన్ జీ టాటా దత్తపుత్రుడు.
  • 1904లో పుట్టిన ఆయన 1989 వరకు బతికి ఉన్నారు.
  • 1991 – 2012 వరకు టాటా గ్రూపునకు ఛైర్మన్ గా వ్యవహరించారు.
  • 2016-17 మధ్యలో తాత్కాలిక ఛైర్మన్ గా ఉననారు.
  • జాగ్వార్ ల్యాండ్ రోవర్.. టెట్లీ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ లను కొనుగోలు చేయటంలో ఆయనదే కీ రోల్
  • టాటా ఇంటర్నేషనల్ కు ఛైర్మన్ గా వ్యవహరించారు.
    రతన్ టాటా
  • నావల్ టాటా – సునీ కమిషరియట్ ల సంతానం.
  • 1937లో పుట్టిన ఆయన 2024 వరకు జీవించి ఉన్నారు.
  • టాటా గ్రూపును మరో స్థాయికి తీసుకెళ్లటమేకాదు.. భారీ ఎత్తున విస్తరించటంలో కీలకభూమిక పోషించారు.
  • భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.
    ఎవరీ నోయల్ టాటా?
  • రతన్ టాటా సవతి సోదరుడే నోయల్ టాటా
  • నావల్ టాటా – సిమోన్ (రెండో భార్య) కుమారుడే నోయెల్ టాటా
  • ప్రస్తుతం ట్రెంట్.. వోల్టాస్.. టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్.. టాటా ఇంటర్నేషనల్ కు ఛైర్మన్
  • టాటా స్టీల్.. టైటాన్ వైస్ ఛైర్మన్.. సర్ రతన్ టాటా ట్రస్టు బోర్డులో స్థానం ఈయన సొంతం
  • టాటా సన్స్ ను నియంత్రించే టాటా ట్రస్టులకు ఛైర్మన్
    జిమ్మీ టాటా ఎవరు?
  • రతన్ టాటాకు స్వయాన తమ్ముడు
  • అరుదైన వ్యక్తిత్వం. విలాస జీవితం కంటే విలువలతో కూడిన జీవితమే ముఖ్యమనే సిద్ధాంతం.
  • డబుల్ బెడ్రూం ప్లాట్ లో సాదాసీదా జీవితం.
  • ముంబయిలోని కొలాబాలో నివాసం. మొదట్నించి వ్యాపారం మీద ఆసక్తి లేదు.
  • మొబైల్ ఫోన్ కూడా వాడరు. టెక్ గాడ్జెట్లను దగ్గరకు రానివ్వరు.
  • కేవలం పుస్తకాలు.. న్యూస్ పేపర్లు మాత్రమే చదివేందుకు ఆసక్తి చూపుతారు.
  • ఇంటి నుంచి బయటకు వెళ్లటానికి అస్సలు ఇష్టపడరు.
  • జిమ్మీ టాటాను జిమ్మీ నావల్ టాటాగా పిలుస్తారు.
  • రతన్ టాటా సొంత తమ్ముడు కావటంతో ఆయనకు గ్రూప్ లో పెద్ద వాటానే ఉంది.
  • అయినా.. వ్యాపారం మీద ఆసక్తి లేక మధ్యతరగతి సామాన్యుడిలా జీవితాన్ని గడుపుతారు.
  • వీరి నికర ఆదాయం విలువ దాదాపు రూ.3800 కోట్లకు పైనే.
  • 2022 నవంబరులో వీరు.. వీరి సోదరుడు రతన్ టాటాల ఉమ్మడి విలువ రూ.23,874 కోట్లు.
  • వ్యాపార ప్రపంచంలో రతన్ టాటా మాత్రమే కనిపిస్తారు.
  • సర్ రతన్ టాటా ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
  • 1989లో తండ్రి నావల్ టాటా మరణించిన తర్వాత ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
    2.

This post was last modified on October 11, 2024 12:13 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago