కొంతమంది కొన్నిసార్లు ఇట్టే ఫేమస్ అయిపోతారు. సాదాసీదా జీవితాలే అయినప్పటికీ.. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు కుమారి ఆంటీ. ఐటీ నగరిలో ఫుట్ పాత్ మీద చిన్న హోటల్ పెట్టుకొని.. రుచికరమైన ఫుడ్ ను సరసమైన ధరల్లో అందించే కుమారి ఆంటీ షాపుపై అధికారులు ప్రతాపం చూడటం.. దీనిపై ఆమె ఆవేదనకు.. నెటిజన్లు.. సోషల్ మీడియా అండగా ఉండటం తెలిసిందే. కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్టు కావటం.. అభయం ఇవ్వటంతో ఆమె జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.
అలా కొన్నివారాల పాటు నాన్ స్టాప్ గా వార్తల్లో వ్యక్తిగా మారిన కుమారి ఆంటీ.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి సాయంగా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50వేలు సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. చిరు మొత్తమే అయినా.. ఇస్తున్నది కుమారి ఆంటీ కావటంతో సీన్లోకి సీఎం వచ్చేశారు.
ముఖ్యమంత్రిని కలిసి.. ఆయనకు తమకు తోచిన సాయాన్ని ఇస్తున్న వైనానికి ముఖ్యమంత్రి సైతం స్పందించి ఆమెను అభినందించారు. కష్టంలో ఉన్న ప్రజలకు తన వంతు సాయంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కుమారి ఆంటీకి మరోసారి నెటిజన్లు అండగా నిలిచారు. ఆమె నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి వెళ్లి మరీ.. సాయాన్ని అందించిన ఆమెను ప్రశంసిస్తున్న వైనంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు.
This post was last modified on September 19, 2024 10:48 am
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…