కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ‘పోర్టు బ్లెయిర్’ పేరును మార్చేసింది. పోర్టు బ్లెయిర్‌కు కొత్తగా ‘శ్రీవిజయపురం’ పేరును పెట్టింది. ఇక, నుంచి అధికారికంగా ఈ పేరు మనుగడలోకి వస్తుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. దేశ స్వాతంత్య్ర సమరం నుంచి కూడా పోర్టు బ్లెయిర్‌కు ప్రాధాన్యం ఉంది.
అప్పట్లో దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన వారిని అరెస్టు చేసి.. పోర్టు బ్లెయిర్‌లో నిర్మించిన సెల్యూలర్ (భూగ ర్భ) జైల్లోనే నిర్బంధించారు. కరడు గట్టిన తీవ్ర వాదులను ఇక్కడ నిర్బంధించడం తెలిసిందే. అలాంటి ప్రాంతం లో స్వాతంత్య్ర సమరయోదులను నిర్బంధించడం.. అప్పట్లో నిరసనకు కూడా దారి తీసింది. ఇక, బ్రిటీష్ కాలంలోనే దీనిని ఏర్పాటు చేయడంతో ‘పోర్టు బ్లెయిర్’గా పిలవడం ప్రారంభించారు.
అప్పట్లో ఇది యుద్ధ ఖైదీలను నిర్బంధించే పెద్ద జైలుగా చలామణి అయింది. ఇక, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. కూడా కొన్నాళ్లు దీనిని వినియోగంలో ఉంచినా.. తర్వాత.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా.. దీనిని పరిరక్షిస్తున్నారు. ఇక్కడే తొలి సారి జాతీయ పతాకాన్ని సుభాష్ చంద్రబోస్ ఎగురవేశారు. దీనికి సంబంధించిన అన్ని చారిత్రక ఆధారాలను కూడా జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.
అయితే.. వలస వాద విధానాలు, చట్టాలను మారుస్తున్న మోడీ సర్కారు ఈ పరంపరంలోనే ఇప్పుడు పోర్టు బ్లెయిర్ పేరును కూడా మార్పు చేసింది. దీనికి శ్రీవిజయపురం పేరును నిర్ణయించింది. ఇక్కడ నుంచే మనకు విజయం దక్కిందన్నది మోడీ ప్రభుత్వం చెబుతున్న మాట. దేశస్వాతంత్య్ర పోరాటానికి తొలి విజయం ఇక్కడే ప్రారంభ మైందని.. అందుకే ‘శ్రీవిజయపురం’ పేరును ఖరారు చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఇక, నుంచి శ్రీవిజయపురం అనేది అధికారిక నామంగా గుర్తించాలని పేర్కొంది.
This post was last modified on September 13, 2024 10:13 pm
ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…