టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను ఎంతగానో మార్చేసింది గత దశాబ్ద కాలంలో. ముఖ్యంగా ఐపీఎల్‌తో క్రికెట్లో ఒక విప్లవమే వచ్చిందని చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో మునుపెన్నడూ చూడని స్థాయి మెరుపులు, కొత్త కొత్త షాట్లు, కళ్లు చెదిరే విధ్వంసక ఇన్నింగ్స్‌లు చూశాం. చూస్తున్నాం. చూడబోతున్నాం.
దీంతో పాటుగా వచ్చిన ఒక పెద్ద మార్పు.. ఫీల్డింగ్‌లో అద్భుత విన్యాసాలు. ఒకప్పుడు కొంచెం ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేసి, లేదా వెనక్కి పరుగెత్తి, లేదా ఏదో ఒక వైపుకు దూకుతూ క్యాచ్ అందుకుంటేనే ఔరా అన్నట్లు చూసేవాళ్లం. కానీ టీ20 క్రికెట్లో ఇలాంటివి మామూలు అయిపోయాయి. బౌండరీ లైన్ల దగ్గర కొందరు ఫీల్డర్ల విన్యాసాలు మన కళ్లను మనమే నమ్మలేని స్థితిని కల్పించాయి.
ఒకప్పుడు బంతి నేరుగా బౌండరీ లైన్ అవతల పడబోతోందని అర్థమైతే ప్రయత్నం కూడా వేస్ట్ అనుకునేవాళ్లు ఫీల్డర్లు. లేదంటే తాము ఎక్కడున్నామో చూసుకోకుండా బంతి మీదే ఫోకస్ పెట్టి క్యాచ్ అందుకుని అలాగే బౌండరీ లైన్ దాటేసేవాళ్లు. అది సిక్సర్ అయ్యేది. కానీ ఇప్పుడలా కాదు. కింద బౌండరీ లైన్ చూసుకుంటూ అలాగే గాల్లోకి ఎగిరి బౌండరీ అవతలికి వెళ్లిపోయి.. గాల్లో ఉండగానే బంతిని విసిరేయడం.. ఇవతల మరొకరు బంతిని క్యాచ్ అందుకోవడం లాంటి నమ్మశక్యం కాని దృశ్యాలు ఎన్నో గత కొన్నేళ్లలో చూశాం.
ఇప్పుడు అదే తరహాలో ఒక అద్భుత విన్యాసం చోటు చేసుకుంది ఆదివారం రాత్రి పంజాబ్, రాజస్థాన్ ఐపీఎల్ మ్యాచ్‌లో. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్.. సిక్స్ ఖాయమనుకున్న బంతిని తిరుగులేని అథ్లెటిజంతో బౌండరీ లైన్ అవతల గాల్లో ఉండి అందుకుని కింద పడబోతూ రెప్పపాటు వ్యవధిలో మైదానం లోని విసిరి అది సిక్సర్ కాకుండా చేశాడు. దగ్గర్లో ఫీల్డర్ ఉండి దాన్నందుకుంటే క్యాచ్ కూడా అయ్యేది కానీ.. ఫీల్డర్ లేకపోవడంతో సిక్స్ మాత్రమే మిస్సయింది.
ఇంతకుముందు కూడా ఇలాంటి విన్యాసాలు చూశాం కానీ.. పూరన్ చేసింది వాటన్నింటినీ మించిపోయేదే. ఇక్కడో ముఖ్య విషయం ఏంటంటే.. ఐదేళ్ల కిందట ఈ పూరన్ ప్రమాదంలో తన రెండు కాళ్లు విరగ్గొట్టుకుని ఆరు నెలలకు పైగా మంచానికి పరిమితం అయ్యాడు. అతను మళ్లీ కోలుకుని క్రికెట్ ఆడతాడని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ దృఢ సంకల్పంతో కోలుకుని మళ్లీ వెస్టిండీస్ టీంలో చోటు సంపాదించాడు. ఇప్పుడు ఈ అద్భుత విన్యాసంతో ఔరా అనిపించాడు.
This post was last modified on September 28, 2020 2:11 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…