రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ తరఫున సభ్యత్వాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికిపైగా సభ్యత్వాలు తీసుకున్నారు. తద్వారా.. రూ.500 సభ్యత్వం కట్టిన వారికి రూ.5 లక్షలవరకు ప్రమాద బీమాను కల్పించారు. దీనికితోడు పవన్‌పై ఉన్న అభిమానంతో ఎక్కువ మంది పార్టీలో సభ్యత్వాలు తీసుకున్నారు. ఇక, ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఆ పార్టీ కూడా సభ్యత్వాలకు సిద్ధమైంది.
ఇది ఎలా ఉందంటే.. రాష్ట్రంలో అందరూ సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు.. మీరెందుకు చేయడం లేదని కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ నాయకులు సభ్వత్వాలకు దిగుతున్నారు. అయితే.. ఎవరు వస్తారని.. ఏం చేస్తారని.. సభ్యత్వాలు అంటూ.. కొన్ని గళాలు గుసగుసలా డుతున్నాయి. మేం ఇంకా పుంజుకోవాలి. ఎన్నికల్లో మాకు లభించింది విజయమే అయినా.. బలపడా ల్సింది చాలాఉంది. అది వాపే తప్ప బలుపు కాదు
అని తూర్పుగోదావరి కి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
అంటే.. ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీస్థానాలు గెలిచినా.. 8 అసెంబ్లీ స్థానాల్లోవిజయం దక్కించుకున్నా.. అది పార్టీ పరంగా ఒంటరిగా తెచ్చుకున్న విజయం కాదనేది ఆయన అభిప్రాయం. నిజానికి బీజేపీ ఒంటరిగా పోటీకి దిగి ఉంటే.. అప్పుడు తెలిసేదని కూడా.. వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సభ్యత్వం చేపడుతున్నా.. దీనిపై పెద్దగా ఆశలు లేవని కూడా చెప్పుకొచ్చారు. గతం కన్నా 0.1 శాతం పెరుగుతుందేమో అని వ్యాఖ్యానించారు. కానీ, పార్టీ పరంగా చూస్తే మాత్రం చాలానే ఆశలు కనిపిస్తున్నాయి.
పార్టీ నాయకలు ఎక్కువ మంది గెలిచి ఉండడం.. ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్న నేపథ్యంలో పార్టీని పుంజుకునేలా చేయాలన్నది కేంద్ర బీజేపీ అధిష్టానం చెబుతున్న మాట. కానీ, వాస్తవపరిస్థితులు క్షేత్రస్థాయిలో దానికి భిన్నంగా ఉన్నాయి. దీంతో పార్టీ ఏమేరకు సభ్యత్వాలను నమోదు చేసుకుంటనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈ నెల నాలుగో వారంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు రెడీ అవుతోంది. దనికి సంబంధించి టార్గెట్లు కూడా పెడుతున్నట్టు తెలిసింది. మరి వీటిని ఎలా రీచ్ అవుతారో..జనాల నుంచి ఎలాంటి రియాక్షన్‌వస్తుందోచూడాలి.
This post was last modified on %s = human-readable time difference 3:19 am
ఇంకో పది రోజుల్లో నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఎన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో…
చాలా గ్యాప్ తర్వాత ఒక వీకెండ్ మొత్తం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడటం దీపావళికి జరిగింది. పెద్ద స్టార్…
మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంత నామమాత్రంగా ఉంటాయో తెలిసిందే. కథానాయికలకు మంచి గుర్తింపు ఉన్న పాత్రలు పది సినిమాల్లో…
ప్రస్తుతం సినిమాల స్కేల్ పరంగా ప్రభాస్ను అందుకునే హీరో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు. బాహుబలితో ఎవ్వరికీ సాధ్యం…
టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకడు. నిర్మాతగా తొలి చిత్రం ‘దిల్’తో మొదలుపెడితే ఒకప్పుడు వరుసగా…
దర్శకులు కొన్నేళ్ల జర్నీ తర్వాత నటులవుతుంటారు. అలాగే నటులు కొన్నేళ్ల అనుభవం వచ్చాక దర్శకత్వం మీద ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. వెంకీ…