ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లకు సంబంధించి అట్టుడుకుతున్న భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా మరోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజధాని ఢాకాలో మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన మద్దతు దారులకు, సంఘాల నాయకులకు మధ్య వివాదం చెలరేగింది.
ఈ ఘర్షణల్లో ఇరు పక్షాలు దాడులు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 24 గంటల్లో 32 మందికిపై ఉద్యమ కారులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో నిరసన కారులు తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని.. అందరినీ ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేయాలని డిమాండ్లు తెరమీదికి వచ్చాయి.
అయితే… సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేది లేదని, దీనిని కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే తాజాగా మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశంలోని ముఖ్యంగా ఢాకాలోని భారతీయ పౌరులు తమకు అందుబాటులో ఉండాలని కోరింది. పరిస్థితి విషమిస్తే.. ఏ క్షణంలో అయినా.. భారత్‌కు తిరిగి రావాలని.. దీనికి అన్ని విధాలా తమ సహకారం ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
This post was last modified on August 5, 2024 10:15 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…