అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదైంది. ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను సూపర్-8 మ్యాచ్ లో ఓడించిన అప్ఘానిస్థాన్ జట్టు…తాజాగా ఆసీస్ ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపి సెమీస్ కు చేరింది. బంగ్లాదేశ్ తే జరిగిన సూపర్-8 దశలోని చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అప్ఘాన్ జట్టు అద్భుత విజయం సాధించి సెమీస్ కు దూసుకువెళ్లింది.
నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో విజయం చివరి ఓవర్ వరకు ఇరు జట్లతో దోబూచులాడింది. మధ్యలో పలుమార్లు వర్షం అంతరాయం కల్గించినప్పటికీ ఈ నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో అప్ఘాన్ జట్టు ఒత్తిడిని తట్టుకొని అప్ఘాన్ నిలబడగలిగింది. బంగ్లా బ్యాట్స్ మన్ లిట్టన్ దాస్ అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచినా తన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్ కు సహకరిస్తున్న స్లో పిచ్ పై అప్ఘాన్ ఓపెనర్ గుర్బాజ్(43) మినహా మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్(54) అజేయ అర్థ సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. 8 వికెట్లు కోల్పోయిన బంగ్లా విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు కావాలన్న దశలో బౌలింగ్ వేసిన నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీసి బంగ్లాను ఆలౌట్ చేశాడు.
దీంతో, తొలిసారి అఫ్ఘాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ సెమీస్ కు చేరి ఆస్ట్రేలియాను ఇంటి దారి పట్టించింది. ఇప్పటికే ఈ గ్రూప్ లో మొదటి స్థానంలో ఉన్న ఇండియా సెమీస్ కు చేరగా అప్ఘాన్ రెండో స్థానంలో నిలిచి సెమీస్ లో అడుగెపెట్టింది. ఈ నెల 27న జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టుతో అప్ఘానిస్థాన్ తలపడనుంది. ఈ రెండు జట్లు ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీని ఇప్పటి దాకా అందుకోలేదు. అదే రోజున జరగనున్న రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది.
This post was last modified on June 25, 2024 12:14 pm
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…