Trends

కల్తీ సారా 29 మందిని మింగేసింది

80, 90 దశకాల్లో కల్తీ సారా తాలూకు దారుణాల గురించి తరచుగా వార్తలు వినేవాళ్లం. మద్యం చాలినంత స్థాయిలో జనాలకు అందక, లేదా ఆంక్షల వల్ల అప్పట్లో కల్తీ సారా తాగి జనాలు ప్రాణాలు కోల్పోయేవాళ్లు. కానీ ఇప్పుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో మద్యం ఏరులై పోరుతోంది. చీప్ లిక్కర్ దగ్గర్నుంచి టాప్ బ్రాండ్స్ వరకు అన్ని రకాల మద్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఇలాంటి రోజుల్లో కల్తీ సారా తాగి 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాట తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా అందులో ఆరుగురు చనిపోయారు. తర్వాత ఆసుపత్రి పాలైన వాళ్లలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది.

మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి గురువారం ఉదయానికి 29కి చేరుకుంది. మిగతా వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో చికిత్స జరుగుతున్న ఆసుపత్రి ప్రాంగణం దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. మృతులు, ఇతర బాధితులు స్థానికంగా తయారయ్యే సారా తాగి అస్వస్థతకు గురయ్యారు.

మద్యం తాగి కింద పడి దొర్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్‌పై బదిలీ వేటు వేయగా.. ఎస్పీ సమయసింగ్ మీనా మీద సస్పెన్షన్ విధించారు.

This post was last modified on June 20, 2024 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొదటి రిలీజ్ 3 కోట్లు – రీ రిలీజ్ 7 కోట్లు

ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…

5 hours ago

శంకర్ ఆడుతున్న ఒత్తిడి గేమ్

సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…

5 hours ago

ముందు లక్కు వెనుక చిక్కు

యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…

5 hours ago

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా…

5 hours ago

డిజాస్టర్ సినిమాకు రిపేర్లు చేస్తున్నారు

కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…

10 hours ago

చిన్న బడ్జెట్‌లతో పెద్ద అద్భుతాలు

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…

11 hours ago