కరోనా ధాటికి ఇండియాలో లాక్ డౌన్ అమలవడంతో రెండు నెలల పాటు అన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ షరతుల్ని ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చారు. వివిధ వ్యాపారాలు పున:ప్రారంభమయ్యాయి. యధావిధిగా నడుస్తున్నాయి. ఐతే కొన్నింటి మీద మాత్రం నిషేధం కొనసాగుతోంది. థియేటర్లకు ఇంకా అనుమతులు రాలేదు.
బార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు వాటి మీద నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నాయి. ఆ రంగంలోని వాళ్లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బయట వైన్ షాపులను నాలుగు నెలల ముందే తెరిచేసి.. బార్లకు మాత్రం అనుమతులు ఇవ్వకపోవడం పట్ల వాటిని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు బార్ల మీద నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ వారాంతం నుంచే అక్కడ బార్లు నడుస్తున్నాయి.
సరిగ్గా ఐపీఎల్ ఆరంభమైన సమయంలోనే ఏపీలో బార్లు తెరుచుకోవడం విశేషం. సాయంత్రం పూట బార్లలో తిష్ట వేసి ఐపీఎల్ చూడటం మందుబాబులకు మంచి కిక్కిస్తుంది. ఐపీఎల్ టైంలో బార్ల వ్యాపారం ఓ రేంజిలో జరుగుతుంది. మామూలుగానే వేసవిలో బార్లకు వచ్చి చిల్ అయ్యేవాళ్లు ఎక్కువ. ఆ టైంలో ఐపీఎల్ కూడా తోడైతే వాళ్ల ఆనందానికి అవధులుండవు. మందుకొడుతూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ, బెట్టింగులు కడుతూ మూడు గంటల పాటు కాలక్షేపం చేస్తారు.
ఐతే కరోనా కారణంగా లేటుగా, యూఏఈలో ఐపీఎల్ ఆరంభం కాగా.. ఈ టైంలో బార్లు తెరవకపోవడం ఆ రంగానికి తీవ్ర నష్టం తెచ్చిపెట్టేదే. మందు బాబులూ వాటిని మిస్సవుతారు. అందుకే ఆదాయ కోణంలో చూసి ఏపీ ప్రభుత్వం వాటికి అనుమతులు ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఆలస్యం చేయకుండా మరి కొన్ని రోజుల్లోనే బార్లకు అనుమతులు ఇవ్వబోతోందని.. వచ్చే వీకెండ్లో క్రికెట్ ప్రియులు బార్లలో ఐపీఎల్ ఎంజాయ్ చేస్తూ మందుకొట్టొచ్చని సమాచారం.
This post was last modified on September 20, 2020 2:20 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…