కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని రెండు పోలీస్ స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.
ప్రజల్ని కాపాడేందుకు అహరహం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ బారిన పడటంతో.. మిగిలిన సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రెండు స్టేషన్లను మూసివేశారు. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కు పంపించారు.
కోయంబత్తూరు సమీపంలోని పొదనూర్.. కునియాముత్తూర్ స్టేషన్లలో పని చేసే ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు.. రెండు స్టేషన్లలో పని చేసే 105 మంది పోలీసు సిబ్బందికి ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.
అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారందరిని క్వారంటైన్ కు పంపి.. రెండు స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తొలినాళ్లలో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేరళలో కేసులు పెద్ద ఎత్తున నమోదైన వేళ.. తమిళనాడులో నామమాత్రంగా కేసుల నమోదు ఉండేది.
ఇలాంటి పరిస్థితి నుంచి.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిన దుస్థితిలో తమిళనాడులో చోటు చేసుకుంది. ఇప్పుడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1821కు చేరగా.. వారిలో 900 మంది కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని రీతిలో తమిళనాడులో ఇప్పటివరకూ 96 మంది పోలీసులు కరోనా బారిన పడటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో పెద్ద సంఖ్యలో పోలీసు శాఖకు చెందిన వారు కరోనా పాజిటివ్ గా తేలిన చెత్త రికార్డు తమిళనాడు సొంతంగా చెప్పాలి.
This post was last modified on April 27, 2020 4:11 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…