ఎలాన్ మస్క్. ఈ పేరుకు ఒక బ్రాండ్ ఉంది. ఈ పేరుకు ఒక ఇమేజ్ కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ రెండూ ప్రశ్నార్థకంగా మారాయి. తాజాగా మస్క్‌పై ప్రఖ్యాత పత్రిక న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన కథనం.. ఆయన సంపద సహా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపనుందని అంటున్నారు ఆర్థిక వేత్తలు. దీనికి కారణం.. 52 ఏళ్ల వయసులో ఆయన ప్రేమలో పడడం ఒక ఎత్తయితే.. తన స్నేహితుడి భార్యతోనే వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం మరో విషయం. ఈ రెండు అంశాలు కూడా.. ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తున్నాయి. ఈ పరిస్థితి మస్క్ వ్యాపారాలపైనా ప్రభావం చూపనుందని అంటున్నారు.
ఏం జరిగింది?
ఎలాన్ మస్క్‌కు ముగ్గురు భార్యలు ఉన్నారు(వీరిలో ఒకామెనే రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు). అయితే.. వారితో ఏనాడో ఆయన తెగతెంపులు చేసుకున్నారు. 2000లో జస్టిన్‌ను వివాహం చేసుకున్న మస్క్ 2008లో విడాకులిచ్చారు. తర్వాత రెండేళ్ల విరామం తీసుకుని 2010లో తలులా రిలే అనే డ్యాన్సర్‌ను వివాహం చేసుకుని రెండేళ్లకే కథ ముగించారు. ఇక్కడ చిత్రమేంటంటే.. ఏడాది గ్యాప్ తర్వాత.. మరోసారి రిలేను 2013లో పెళ్లి చేసుకున్నారు. అయినా. వీరి బంధం కొనసాగలేదు. 2016లో విడిపోయారు. అప్పటి నుంచి మస్క్ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ సతీమణి, మోడల్ నికోల్‌తో పరిచయం ఏర్పడింది.
2021లో తొలిసారి నికోల్ బర్త్ డే వేడుకలకు హాజరైన మస్క్.. తన స్నేహితుడి భార్య అన్న విషయాన్ని మరిచిపోయి.. ఆమె ప్రేమలో పడిపోయారు. మస్క్‌ను నికోల్ కూడా ఇష్టపడింది. తర్వాత.. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ విషయం తెలియడంతో సెర్గీ బ్రిన్.. తన సతీమణికి విడాకులు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నికోల్-మస్క్ యథేచ్ఛగా సహజీవనం చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో ఎక్కడా బయట పడకుండా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. పెట్టుబడులు.. స్టాక్స్‌పై ప్రభావం చూపుతుందనే అంటున్నారు పరిశీలకులు.
అయితే.. తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిని సెర్గీ బ్రిన్ ధ్రువీకరించారు. ఔను వారిద్దరూ ఒక్కటయ్యారు. అందుకే నేను విడాకులు తీసుకున్నా
అని సెర్గీ వివరించారు. ప్రస్తుతం వస్తున్న వార్తలపై మస్క్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలిస్తే.. రాబోయే తన కొత్త ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుందని, పెట్టుబడి దారులు వెనక్కి తగ్గుతారని మస్క్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వెలుగు చూసిన తర్వాత.. మస్క్ వ్యవహారం మార్కెట్ లో గుంభనంగా ఉంది. దీనిపై ఏ చిన్న తేడా వచ్చినా.. మస్క్ మార్కెట్ మరోసారి ఢమాల్ మనడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 26, 2024 4:23 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…