Trends

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య ఆలియాస్ దర్శనం మొగులయ్య ప్రస్తుతం పూట గడిచేందుకు దినసరికూలీగా మారాడు. హైదరాబాద్ లోని తుర్కయంజాల్ సమీపంలో ఓ నిర్మాణస్థలంలో పనిచేస్తున్న మొగులయ్య వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగర్ కర్నూలు  జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య  52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలను ఇచ్చాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకోగా, భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 

తెలంగాణ ప్రభుత్వం నుండి నెలవారీగా వస్తున్న రూ.10 వేల ఫించన్ ఆగిపోవడంతో మొగులయ్య కూలీ పనులకు వెళ్తున్నట్లు చెబుతున్నాడు. మొగులయ్య, కొడుకుల్లో ఒకరు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. తన కొడుకు అవసరాల కోసం నెలకు రూ.7 వేలు కావాలని, ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనం ఎందుకు ఆగిందో తనకు తెలియదని మొగులయ్య అన్నాడు. మొగులయ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ కూడా పాడడం విశేషం.

కిన్నెర గాయకుడు మొగులయ్యకు నటుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పాడే అవకాశం ఇవ్వడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. గతంలో ఆయన అనారోగ్యానికి గురైనపుడు పలువురు ఆర్ధిక సాయం అందించడంతో కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో కూలీ పనులు చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 వేలు గౌరవ వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.

This post was last modified on May 3, 2024 5:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటమి కాస్తా.. ఓదార్పు యాత్ర అయ్యిందే!

తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు,…

11 minutes ago

పవన్ కాల్ షీట్లు వేస్ట్ అయ్యాయా?

పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రాధాన్యం తగ్గించేసి చాలా కాలం అయింది. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని…

15 minutes ago

చంద్ర‌బాబు-పీ4-ప్ర‌జ‌ల‌కు ఎక్కుతుందా ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా పీ-4 విధానంపై దృష్టి పెట్టారు. ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్ట‌న‌ర్ షిప్‌గా పే ర్కొంటున్న ఈ విధానాన్ని ప్ర‌జ‌ల్లోకి…

17 minutes ago

‘స్థానికం’లో జ‌న‌సేన త‌ప్పుకొంది.. రీజ‌నేంటి ..!

స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి చైర్ ప‌ర్స‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌కు సంబంధించిన పోటీ తీవ్ర‌స్థాయిలో జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం…

19 minutes ago

బన్నీ – దేవి : ఆరు మెలోడీల లవ్ స్టోరీ

అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…

55 minutes ago

ఆయ‌న ‘ఎన్నిక‌ల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేషన్ వ‌ర్గీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి…

1 hour ago