కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ఒకటి. అయితే, అందులో సైడ్ ఎపెక్ట్స్ చాలా మంది అనారోగ్యానికి మరణాలకు కాారణం అవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే చాలా కొద్దిమందిలో మాత్రమే ఇది జరుగుతోంది. ఇప్పటివరకు ఈ వాదనను ససేమిరా అన్న సదరు సంస్థ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తన తప్పుల్ని తొలిసారి ఒప్పేసుకుంది.
ఆస్ట్రాజెనెకా అందించిన ఈ వ్యాక్సిన్ ను మన దేశంలో కొవిషీల్డ్స్ పేరుతో ఉత్పత్తి చేయటం తెలిసిందే. ఆస్ట్రాజెనెకా.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ డెవలప్ చేసిన కోవిషీల్డ్.. సీరమ్ ఇన్ స్టిట్యూట్ భారతదేశంలో పంపిణీ చేసింది. భారత్ లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ సైతం కోవిషీల్డ్ అన్న సంగతి తెలిసిందే. స్వదేశీ సాంకేతికతో తయారైన కొవాగ్జిన్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగటం.. అయితే మిగిలిన వ్యాక్సిన్లతో పోలిస్తే నిశ్చింతగా వేయించుకోవచ్చన్న హామీ లభించినప్పటికీ.. ప్రాశ్చాత్య మీడియాతో పాటు కొన్ని స్వదేశీ మీడియాలోని కొన్ని వర్గాల పుణ్యమా అని కొవాగ్జిన్ మీద తప్పుడు ప్రచారం భారీగా సాగింది.
కోవీషీల్డ్స్ వాడిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్న వైనం వెలుగులోకి రావటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. వాటిని ఖండించిన సంస్థ తాజాగా మాత్రం తప్పును ఒప్పుకుంది. కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్.. తక్కువ ప్లేట్ లెట్ కౌంట్ కు దారి తీసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదంటే తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు వంద మిలియన్ పౌండ్ల వరకు పరిహారాన్ని కోరుతూ యూకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2021 ఏప్రిల్ లో జామీ స్కాట్ న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు ఈ సంస్థపై కేసులు వేయటం షురూ చేశారు.
మొదట్లో తన మీద వచ్చిన విమర్శలు.. ఆరోపణల్ని తేలిగ్గా కొట్టేసిన సంస్థ.. తాజాగా మాత్రం తన తప్పులపై ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అయ్యింది. కోవిషీల్డ్ వినియోగించిన వారిలో అరుదైన సందర్భాల్లో థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్.. అంటే రక్తం గడ్డకట్టటం.. బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ తక్కువ అవుతుందని అంగీకరించింది. గడిచిన కొద్ది కాలంగా హటాత్తుగా గుండెపోటుతో మరణించిన చాలామంది కొవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారే అన్న ప్రచారం సాగినా.. దానికి అవసరమైన ఆధారాలు లేకపోవటం తెలిసిందే. తాజాగా తమ వ్యాక్సిన్ లోని సైడ్ ఎఫెక్టులను అంగీకరించటం ద్వారా.. ఇంతకాలం తమపై వస్తున్న ఆరోపణల్లో కొంత నిజం ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లైంది.
This post was last modified on April 30, 2024 11:59 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…