పేరు విజయ్ కుమార్. తమిళనాడు లోని దిండుక్కల్ దగ్గర నచ్చని స్వగ్రామం. అక్కడికి సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో అమ్మమ్మ ఊరు అరసపట్టి. అక్కడ పచ్చని పంట పొలాల మధ్య వారిది ఓ పూరి గుడిసె. అందరు పిల్లల లాగే విజయ్ కుమార్ సెలవులన్నీ అమ్మమ్మ వాళ్ల ఇంటిదగ్గరనే గడిచిపోయేవి.
అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఉదయమే తాత వెంట పొలంగట్ల మీద వేటకు వెళ్లేది విజయ్ కుమార్. నత్తలు, పీతలు, చేపలు, కుందేళ్లు. మధ్యాహ్నానికి వేటలో ఏవి దొరికితే వాటితో ఇంటికి చేరుకునేది. వాళ్ల తాత వాటిని శుభ్రం చేసే లోపు అమ్మమ్మ పసుపు, మిరియాలు, చింతపండు కలిసిన మసాలాలు సిద్దం చేసేది. వేటకు వెళ్లొచ్చిన పిల్లలు స్నానాలు చేసి వచ్చే సరికి అరటాకులో అన్నం, కూరతో రెడీగా ఉండేది.
అమ్మమ్మ చేతి వంట రుచి విజయ్ కుమార్ కు వంటల మీద ఆసక్తి పెంచింది. కొంచెం తెలివి వచ్చాక అమ్మమ్మకు వంటలో సాయం చేయడం నేర్చుకున్నాడు. ఇంటిలో తల్లికి కూడా సాయం చేసేవాడు. ఆ ఆసక్తి అతన్ని హోటల్ మేనేజ్ మెంట్ వైపు నడిపించింది. తిరుచిరాపల్లిలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీలో సీటొస్తే ఏకంగా రూ.50 వేలు అప్పు తెచ్చి మరీ చేరాడు. కానీ అక్కడ చేరాక తమిళం మాత్రమే తెలిసిన తనకు భాష ఇబ్బందిగా మారి మొద్దబ్బాయిగా పేరుపడ్డాడు.
ఒక ఫ్రెంచ్ అధ్యాపకుడు ‘అస్కాగ్’ అనే వంట నేర్పిస్తానని అన్నాడు. తీరా చూస్తే అది మన నత్తల కూరే. వచ్చీరాని భాషలో వాళ్ల అమ్మమ్మ దానిని ఎలా చేస్తుందో వివరించి చేసి చూపాడు. లొట్ట లేసుకుంటూ తిన్న వాళ్లు అందరూ అద్భుతం అన్నారు. అవరోధాలు అధిగమించి ఉత్తమ విద్యార్థిగా మారి తాజ్ హోటళ్లో చెఫ్ గా మారి కాలిఫోర్నియా వరకు వెళ్లాడు. ‘రస’ అనే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ లో ప్రధాన చెఫ్ గా ఆ హోటల్ కు వరసగా ఐదు మిషెలిన్ అవార్డులు సాధించాడు.
కరోనా లాక్ డౌన్ తో రెస్టారెంట్లు అన్నీ మూతపడడంతో మనోడి ఉద్యోగం పోయి రోడ్డు మీద పడ్డాడు. ఇళ్లల్లో క్లీనింగ్ పనులు కూడా చేశాడు. అదే సమయంలో న్యూయార్క్ లో ఉండే రోణి మంజుదార్, చింతన్ పాండ్యాలు తారసపడ్డారు. కొత్త తరహా రెస్టారెంట్ పెడదాం అని ప్రతిపాదించారు. అప్పటి వరకు భారతీయ వంటకాలను అమెరికన్ల కోసం ఉప్పు, కారం తగ్గించి అందించే పద్దతికి స్వస్తిపలికి అమ్మమ్మ చేతి వంటను యధావిధిగా అందిద్దామని ‘సెమ్మ’ (అదిరింది) రెస్టారెంట్ ప్రారంభించారు.
నత్తల వేపుడు, చేపల పులుసు, బోటీలతో పాటు వాళ్ల అమ్మ 22 మసాలా దినుసులతో తయారుచేసే సాంబారును అందించాడు. వాటిని తిన్న అమెరికన్లు అద్భుతం అని ప్రశంసలు కురిపించారు. దీంతో ఏడాది తిరగకుండానే మిషెలిన్ స్టార్ వచ్చింది. అమెరికాలోని టాప్ 10 రెస్టారెంట్లలో ఒకటిగా న్యూయార్క్ టైమ్స్ గుర్తించింది అని తెలిపాడు విజయ్ కుమార్. నిజంగా విజయ్ కుమార్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమే.
This post was last modified on April 29, 2024 8:01 am
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…