టిల్లు స్క్వేర్ కి పాజిటివ్ టాక్ వేగంగా పాకుతోంది. మార్నింగ్ షోల నుంచే ఆక్యుపెన్సీలు గట్టిగా ఉన్నా కొంచెం నెమ్మదిగా కనిపించిన బిసి సెంటర్స్ లో మధ్యాన్నం నుంచే స్పీడ్ అందుకోవడం కలెక్షన్లలో కనిపిస్తోంది. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి టీమ్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం దానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మొదటి రోజు 25 కోట్ల దాకా గ్రాస్ వస్తుందని, ఫైనల్ రన్ అయ్యేలోగా 100 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకం తనకుందని నిర్మాత నాగవంశీ చెప్పడం చూస్తే రిపోర్ట్స్ ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చాల చోట్ల సాయంత్రం నుంచే షోలు పెంచుతున్నారు.
ప్రాక్టికల్ గా చూస్తే వంద కోట్ల గ్రాస్ సాధ్యమేనా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ఈ టాక్ తో కనీసం మూడు వారాలు బలంగా నిలబడితే చాలు ఆ మార్క్ అందుకోవచ్చు. కాకపోతే కొన్ని అంశాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ రానుంది. ఫస్ట్ వీక్ అయితే నిర్మాత దిల్ రాజు కాబట్టి థియేటర్ ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. టిల్లు స్క్వేర్ కి ఇచ్చిన ఎక్స్ ట్రా స్క్రీన్లు డిమాండ్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ సినిమాకు ఇచ్చేస్తారు. దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాని మీద సెకండ్ వీక్ లో టిల్లు ఆడబోయే వీరంగంలో హెచ్చు తగ్గులు లెక్క వేయొచ్చు.
కంటెంట్ కనెక్ట్ అయిపోతే స్టార్ ఉన్నా లేకపోయినా వంద కోట్ల గ్రాస్ వచ్చేస్తుందని గతంలో ఉప్పెన, దసరా లాంటివి నిరూపించాయి. కాకపోతే టిల్లు స్క్వేర్ కి కుటుంబ ప్రేక్షకుల మద్దతు ఎంత మేరకు ఉంటుందనేది వేచి చూడాలి. ఎందుకంటే ఎలాగూ వచ్చే వారం ఫ్యామిలీ స్టార్ ఉంది కాబట్టి దాన్ని ఛాయస్ గా పెట్టుకున్న వాళ్ళు టిల్లుని సెకండ్ ఆప్షన్ గా మార్చుకుంటారు. కాకపోతే యూత్, మాస్ సపోర్ట్ బలంతో టిల్లు స్క్వేర్ ఈజీగా నెగ్గుకొస్తాడు. ఈ వీకెండ్ మొత్తం సిద్దు జొన్నలగడ్డ కంట్రోల్ లోకి వెళ్లిపోవడం ఖాయం. ఫైనల్ గా వంద కోట్ల కంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదనేది ట్రేడ్ అంచనా.
This post was last modified on March 29, 2024 10:34 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…