దేశం కాని దేశంలో తెలంగాణకు చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను దారుణంగా చంపేసిన హంతకులు.. శవాన్ని చెత్తకుప్పలో పూడ్చి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన మాదగాని బాల్ శెట్టిగౌడ్ కుమార్తె చైతన్య.. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల మిర్కావేలో నివాసం ఉంటున్నారు.
వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే చైతన్య భర్త అశోక్ రాజ్ తో కలిసి విదేశాలకు వెళ్లారు. వారి ఇంటికి 86 కి.మీ దూరంలోని చెత్త కుండీలో ఆమె మృతదేహం లభ్యమైంది. శనివారం మధ్యాహ్నం మృత దేహాన్ని గుర్తించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పరిశీ లించి.. చైతన్య మరణంపై ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. చైతన్య నివాసానికి వెళ్లి పలు ఆధారాలు సేకరించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యులను విచారించిన అనంతరమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, దీని వెనుక కుటుంబ తగాదాలు.. భర్త ఆగడాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చైతన్య, అశోక్‌రాజ్‌లది పెద్దలు కుదిర్చిన వివాహంగా చెబుతున్నారు. ఉపాధా నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న అశోక్.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తరచుగా భార్యా భర్తల మధ్య వివాదాలు వస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె దారుణ హత్యకు భర్తే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on March 10, 2024 1:54 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…