Trends

క్రికెట్ విరాట్ కోహ్లీ.. డీప్‌ఫేక్ వీడియో.. క‌ల‌కలం!

డీప్‌ఫేక్ వీడియోలు ప్ర‌ముఖుల‌ను క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నారు. ఈ బాధితుల్లో ప్ర‌ధాన మంత్రి నుంచి క్రీడాకారుల వ‌ర‌కు.. చివ‌ర‌కు న‌టుల వ‌ర‌కు ఎవ‌రినీ ఫేక్ మాయ‌గాళ్లు వ‌దిలి పెట్ట‌డం లేదు. కృత్రిమ మేథ సాయంతో రూపొందిస్తున్న ఈ డీప్ ఫేక్ వీడియోల‌పై స‌ర్వాత్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా భార‌త క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కోహ్లీకి సంబంధించిన డీప్ పేక్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఓ బెట్టింగ్‌ యాప్‌ను కోహ్లీ ప్ర‌మోట్ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉండటం గమనార్హం.

విష‌యం ఏంటంటే..

ఓ టీవీ ఛానల్‌ లైవ్‌ న్యూస్‌ కార్యక్రమంలో ‘కోహ్లీ యాడ్‌’ను ప్రసారం చేసినట్లు సైబర్‌ కేటుగాళ్లు ఈ వీడియోను సృష్టించారు. గతంలో కోహ్లీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మార్ఫింగ్‌ చేసి.. బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు రూపొందించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించవచ్చో కోహ్లీ చెబుతున్నట్లుగా రూపొందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా వైరల్‌ అవుతోంది. అయితే.. దీనిపై కోహ్లీ ఇంకా స్పందించలేదు.

సెల‌బ్రిటీలే ల‌క్ష్యంగా

డీప్ ఫేక్ వీడియోల బారిన ప‌డుతున్న వారిలో దాదాపు అంద‌రూ సెల‌బ్రిటీలే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవల మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్కర్‌ కూడా ఓ గేమింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు నకిలీ వీడియో వైరల్ అయింది. అయితే.. నిముషాల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న తెర‌మీదికి వ‌చ్చిన అది త‌న‌ది కాద‌ని.. ఏఐతో సృష్టించార‌ని.. దీనిని న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ స్పష్టతనిచ్చారు.

స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌..

ఏఐ(ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌) టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కనిపించినా..చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై సీరియ‌స్ అయింది. సామాజిక మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కూడా కేంద్రం కొన్ని సూచ‌న‌లు చేసింది. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామ‌ని కూడా గ‌త ఏడాది ప్ర‌క‌టించింది.

వీరంతా బాధితులే..

  • క్రికెట్ దిగ్గ‌జం సచిన్‌ కుమార్తె సారా టెండూల్కర్‌
  • సినీ తారలు రష్మిక, కత్రినాకైఫ్‌ మార్ఫింగ్‌ వీడియోలు
  • ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గార్భా నృత్యాలు

This post was last modified on February 21, 2024 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

40 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago