గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి వారి సేవలో తరించాల్సిన ఓ మహిళా అధికారి.. తన సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వసూలు చేసుకున్నారు. సహజంగా మహిళా అధికారులు అంటే.. లంచాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటారనే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్సయిన లంచావతారానికి ప్రతిరూపంగా నిలిచింది. సోమవారం ఆమె కార్యాలయంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కానీ, జ్యోతి మాత్రం.. కన్నీరు పెట్టుకుని.. తాను అడగకపోయినా.. లంచం ఇచ్చారని.. ఆ సొమ్ముకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను చాలా నిజాయితీ పరురాలినని, కొందరు ఉద్దేశ పూర్వకంగా తనపై ఫిర్యాదు చేసి.. తన ఉన్నతిని అడ్డుకుంటున్నారని.. బోరున విలపించారు. దీంతో పాపం.. కదా.. అనే సానుభూతి వచ్చింది. అయితే.. అసలు విషయం తర్వాత తెలిసింది. ఏసీబీ అధికారులు ఆమె కన్నీటికి కరిగిపోకుండా.. ఇంటిని చుట్టుముట్టారు.
ఆమె ఇంట్లోసోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ కట్టల కొద్దీ 500 నోట్లు కనిపించాయి. మంచం కింద.. బాత్ రూమ్ అల్మరా, కిచెన్ సహా దేన్నీ ఆమె వదలకుండా.. అన్నింటినీ బ్యాంకుగా మార్చేసి.. కట్టలు కూరేసింది. అంతేకాదు.. కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలు.. కూడా ఉన్నాయి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెకు రిమాండ్ ఖైదు విధించింది.
This post was last modified on February 20, 2024 2:33 pm
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…