కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న మైదానాలు మళ్లీ ఆటలతో సందడి చేస్తున్నాయి. దాదాపుగా అన్ని ఆటలూ పున:ప్రారంభం అయ్యాయి. టెన్నిస్‌లో గ్రాండ్ స్లామ్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నారు. మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలను నిర్వహించే అవకాశం లేకపోగా.. ఏడాదిలో చివరి గ్రాండ్ స్లామ్ అయిన యుఎస్ ఓపెన్‌ను వారం కిందటే మొదలుపెట్టారు. రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, హలెప్ సహా చాలామంది స్టార్ క్రీడాకారులు ఈ టోర్నీకి దూరమైనా సరే.. యుఎస్ ఓపెన్‌ను అనుకున్న ప్రకారమే నిర్వహిస్తున్నారు.
ఐతే పురుషుల సింగిల్స్‌లో చాలామంది స్టార్లు దూరం కాగా.. మిగిలిన ఏకైక ఆకర్షణ నొవాక్ జకోవిచే. ఈ ప్రపంచ నంబర్ టూ ఆటగాడు టోర్నీలో ఆడి తీరాలని పట్టుదలతో వచ్చాడు. జకోకు సవాలు విసిరే వాళ్లలో చాలామంది టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇక అతడికి ఎదురే ఉండదని.. మరో గ్రాండ్‌స్లామ్ అతడి ఖాతాలో చేరినట్లే అని అంతా అనుకున్నారు. అంచనాలకు తగ్గట్లే తొలి మూడు రౌండ్లలో ఘనవిజయాలు సాధించి ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకొచ్చాడు జకోవిచ్. కానీ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అనూహ్య పరిణామం జరిగి జకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది.
బుస్టా అనే ఆటగాడితో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో జకోవిచ్ 5-6తో వెనుకబడి ఉన్న దశలో ఒక పాయింట్ కోల్పోయిన అసహనంలో జకోవిచ్.. బంతిని రాకెట్‌తో లైన్ జడ్జ్ ఉన్న వైపు కొట్టాడు. అది లైన్ జడ్జ్‌గా ఉన్న మహిళ ముఖానికి గట్టిగా తాకింది. ఆమె వెంటనే కుప్పకూలింది. జకోవిచ్ ఉద్దేశపూర్వకంగా చేశాడో, అనుకోకుండా జరిగిందో కానీ.. టోర్నీ నిర్వాహకులు దీన్ని తీవ్ర విషయంగా పరిగణించి అతడిపై అనర్హత వేటు వేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. టైటిల్ ఖాయం అనుకున్న ఆటగాడు ఇలా అనూహ్యంగా నిష్క్రమించడం టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
This post was last modified on September 7, 2020 10:32 pm
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…