వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అఫ్ఘానిస్థాన్‍తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు తిరగరాశాడు.16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 84 బంతుల్లో 131 పరుగులు చేసి అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హిట్ మ్యాన్ 63 బంతుల్లోనే మెరుపు శతకం చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్(72 బంతుల్లో సెంచరీ) పేరిట ఉంది. ఇక, వన్డేలలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టించాడు.
మరోవైపు, 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో 7 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మన్ గా రోహిత్ అవతరించాడు. వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లోనే రోహిత్ ఈ ఘనత సాధించగా..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 44 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్ గా రోహిత్ సౌరవ్ గంగూలీ సరసన నిలిచాడు. 2003 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా గంగూలీ సెంచరీ చేశాడు. వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్ మన్ కూడా రోహిత్ శర్మనే.
ఇక, వన్డేలలో 31 సెంచరీలతో పాంటింగ్ రికార్డు చెరిపేసిన రోహిత్..కోహ్లీ(47), సచిన్ (49)ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. ఇక, అంతర్జాతీయ క్రికెట్‍లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు హిట్ మ్యాన్. 554 అంతర్జాతీయ సిక్సర్లు బాది వెస్టిండీస్ బ్యాట్స్ మన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ (553 సిక్సర్లు) రికార్డు బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ(131) అద్భుతమైన ఇన్సింగ్స్ కు తోడు లోకల్ బాయ్ కోహ్లీ హాఫ్ సెంచరీ(55), ఇషాన్ కిషన్(47), శ్రేయాస్ అయ్యర్(25) రాణించడంతో భారత్ 35 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మెరుగైన రన్ రేట్ సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో 1.500 రన్ రేట్ తో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 4 పాయింట్లతో 1.958 రన్ రేట్ తో మొదటి స్థానంలో ఉంది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో శనివారం నాడు ఇదే వేదికపై తమ చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్థాన్ తో అమీతుమీకి టీమిండియా సిద్ధమవుతోంది.
This post was last modified on October 12, 2023 6:14 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…