నాజులైన ఉత్పత్తులతో తనకు సాటి మరెవరూ రానట్లుగా ఉండే యాపిల్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెక్ దిగ్గజ కంపెనీ అయిన ఈ సంస్థ తాజాగా హిస్టరీ క్రియేట్ చేసింది. తాజగా ఆ కంపెనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అమెరికాలో 2లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీగా అవతరించింది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండేళ్ల క్రితం యాపిల్ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అందుకు రెట్టింపు విలువను సొంతం చేసుకోవటం విశేషం. అమెరికాలో ఈ రికార్డు ఉన్న కంపెనీ మరొకటి లేదని చెబుతున్నారు. ఇంతకూ ఇంత భారీ రికార్డుకు కారణం.. ఈ ఏడాదిలోయాపిల్ షేర్లు 60 శాతం దూసుకెళ్లటమేనని చెబుతున్నారు.
ఇంత భారీ రికార్డును సొంతం చేసుకున్న యాపిల్.. కరోనా కష్టకాలంలో సాధించటం ప్రత్యేకతగా చెప్పాలి. ఈ సంక్షోభ సమయంలో చాలా కంపెనీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. అందుకు భిన్నంగా యాపిల్ మాత్రం కొత్త రికార్డును నెలకొల్పటం ప్రత్యేకతగా చెప్పక తప్పదు. చైనాలో ఐఫోన్లు ఉత్పత్తి చేసే ప్లాంట్లను మూసివేయటం.. కరోనా నేపథ్యంలో రిటైల్ అమ్మకాలు ఆగిపోవటం లాంటి చిక్కుల్ని అధిగమించటం విశేషం.
యాపిల్ సంగతి ఇలా ఉంటే..సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ అరామ్ కో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను 2019లోనే సొంతం చేసుకుంది. పబ్లిక్ కంపెనీగా మారిన కొద్దిరోజులకే ఈ ఘనతనుసాధించినా.. గడిచిన కొద్ది నెలలుగా చమురు ధరలు తగ్గిపోవటంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 1.82లక్షల కోట్ల డాలర్లకు పడిపోవటం గమనార్హం.
This post was last modified on August 20, 2020 11:06 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…