నిజమే.. మీరు చదివింది నిజంగానే జరిగింది. కట్టుకున్న భార్యను ఎంతో ఇష్టపడి.. ప్రేమించిన భర్త.. ఆమెను ఉన్నత చదువులు చదివించాడు. ఆమె అబీష్టాన్ని నెరవేర్చాడు. తీరా చదువు పూర్తయి.. ఉద్యో గం వచ్చాక.. సదరు భార్యామణి.. లవర్‌తో జంప్ అయిపోయింది! దీంతో ఆ భర్త ఇప్పుడు లబోదిబోమం టున్నా డు. ఈ పక్కా మోసం.. మధ్య ప్రదేశ్‌లో జరిగింది. విషయంలో సీరియస్ నెస్ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్ జిల్లా పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా, మీనాక్షి దంపతులు. వీరిద్దరిలో మీనాక్షిని జోహాన్ ప్రేమించి మరీ చేసుకున్నాడు. సరే.. ఈ ప్రేమతోనే ఆమె చెప్పిందల్లా చేశాడు. ఆయన కోరిందల్లా సమకూర్చాడు. ఈ క్రమంలోనే తనకు నర్సు కావాలని ఎప్పుటి నుంచో కోరికని.. సమజానికి సేవ చేస్తానని మీనాక్షి చెప్పింది. దీంతో సదరు కాదనకుండా.. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మరీ ఆమెను చదివించాడు.
ఎట్టకేలకు ఆమె నర్సు ఉద్యోగం సంపాదించింది. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడికి ఆమె వెళ్లాక అసలు సమస్య మొదలైంది. అక్కడ ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఆ వ్యక్తితోనే కలిసుండాలని నిర్ణయించుకొని, జోహన్‌న వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తెను సైతం తీసుకెళ్లిపోయింది.
అయితే.. ఎంతో ప్రేమించిన భార్య.. తనని విడిచి వెళ్లడంతో మానసికంగా కుంగిపోయిన భర్త.. వెళ్లొద్దని, తనతోనే ఉండాలని ఎంతో ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. పైగా.. ‘నా జీవితంలోకి మరొకరు వచ్చారు, నువ్వు కూడా ఎవరినైనా చూసుకో’ అని చెప్పి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మోసం గురూ“ అని కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on August 14, 2023 11:05 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…