ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని సెలబ్రిటీలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా పెళ్లి ఎప్పుడు అంటూ ఆయనకు ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గతంలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా రాహుల్ పెళ్లిపై చర్చ జరిగింది. తాను పెళ్లి చేసుకుంటానని తనకు కాబోయే భార్య ఇలా ఉండాలని కూడా రాహుల్ వివరించడంతో ప్రస్తుతం రాహుల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అనుకుంటున్నారు.
ఇక, కొందరు మహిళలు ఏకంగా రాహుల్ పెళ్లి ఎప్పుడు అంటూ సోనియా గాంధీని ప్రశ్నించడం వైరల్ గా మారింది. హర్యానాకు చెందిన కొందరు మహిళలు సోనియాగాంధీ ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడారు. మంచి పిల్లని చూడాలంటూ సోనియా వారితో అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు తనకు అభ్యంతరం లేదని బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ ఛోప్రా షాకింగ్ కామెంట్స్ చేసింది.
రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని, కానీ దానికి ఓ షరతు ఉందని చెప్పుకొచ్చింది. ఒకవేళ రాహుల్ ను పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కూడా తన ఇంటి పేరు ఛోప్రాగానే కొనసాగుతుందని షరతు పెట్టింది. ఇక మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరటనివ్వడంపై హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన బోల్డ్ కామెంట్స్ తో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 7, 2023 7:38 am
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…