ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ మారింది కానీ మొదటి భాగంలో నటించిన నేహా శెట్టి పాత్రను తక్కువ చేసి చూడలేం. సిద్ధూ జొన్నలగడ్డతో అమ్మడి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పేలింది. ప్రియుడిని చంపేసి ఆ కేసులో కూల్ గా కొత్త లవర్ ని ఇరికించిన పాత్రలో సరిగ్గా ఒదిగిపోయింది. రెండో భాగంలో ఎందుకు లేదనే ప్రశ్న హీరోకు దర్శకుడికే తెలియాలి. తన స్థానంలోనే అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. అయితే ఎనిమిదేళ్ల క్రితం కన్నడలో తెరగేట్రం మొదలుపెట్టిన నేహాకి టిల్లు సక్సెస్ ఆఫర్ల వర్షం కురిపించలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలూ రాలేదు.
ట్విస్టు ఏంటంటే ఒక్క పాటతో ఈ మధ్య నేహా శెట్టి సోషల్ మీడియా ట్రెండ్స్ లో బాగా నానుతోంది కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న రూల్స్ రంజన్ నుంచి ఇటీవలే చూసేయ్ చూసేయ్ పాట విడుదలైంది. ట్యూన్ చాలా క్యాచీగా ఉండటంతో పాటు శ్రేయ ఘోషల్ లయ బద్ధమైన గొంతుకు నేహా శెట్టి వయ్యారాలు ఒలికించిన తీరు మీమ్స్, షార్ట్స్, రీల్స్ రూపంలో విపరీతమైన రీచ్ తెచ్చుకుంటోంది. లిరికల్ వీడియోలో ఈమెను చూస్తున్న జనాలు పక్కన హీరో ఉన్న సంగతే మర్చిపోతున్నారు. అంత ఈ సాంగ్ ఎక్కేసింది. దెబ్బకు నేహా స్వయంగా ఇదే స్టెప్పుని వేర్వేరుగా షార్ట్స్ చేస్తోంది.
వరస ఫ్లాపుల వల్ల రూల్స్ రంజన్ మీద ఎలాంటి బజ్ లేదు. మీటర్ చేయడం కిరణ్ అబ్బవరంకి బాగా డ్యామేజ్ చేసింది. జీరో షేర్ మూవీగా డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో అతని మీద నెగటివిటీ తెచ్చి పెట్టింది. కమర్షియల్ ఉచ్చులో తానెంత తప్పు చేస్తున్నాడో దీని వల్ల అర్థమయ్యింది. లక్కీగా ఈ రూల్స్ రంజన్ మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చుకోవడం కలిసొచ్చేలా ఉంది. ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలు మొత్తం ప్యాక్ అయిపోవడంతో సరైన తేదీ కోసం చూస్తున్నారు. నేహా శెట్టికి ఇది కాకుండా బెదురులంక 2012 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
This post was last modified on July 30, 2023 10:55 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…