లవర్‌ను కలిసేందుకు తన ఊర్లో రోజూ పవర్ కట్ చేసే ఓ యువతి.. వీళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్థులు.. ఆ యువకుడిని చితకబాదితే కాపాడేందుకు ప్రయత్నించిన యువతి.. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో పెళ్లితో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. ఇదేం సినిమా కథ కాదు. కానీ మూవీ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో జరిగింది.
బెటియాకు చెందిన ప్రీతి కుమారి.. పక్క గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ప్రేమించుకున్నారు. తన ప్రియుడిని రహస్యంగా కలిసేందుకు వేరే మార్గం లేక ప్రీతి ఓ పథకం వేసింది. గ్రామంలో విద్యుత్‌ను నిలిపివేసి.. చీకట్లో రాజ్‌కుమార్‌ను కలిసేది. ఇలా తరచూ జరుగుతుండడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోనూ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని గ్రామస్థులే రంగంలోకి దిగారు.
ఓ రోజు పవర్ కట్ కాగానే కారణం ఏమిటో తెలుసుకోవాలని గ్రామంలో తిరిగారు. అప్పుడే వీళ్లకు రాజ్‌కుమార్, ప్రీతి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. రాజ్‌కుమార్‌ను కలిసేందుకే విద్యుత్ నిలిపివేస్తున్నానని ప్రీతి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. వెంటనే ఆ యువకుడిపై గ్రామస్థులు దాడికి దిగారు. దీనికి ప్రతీకారంగా రాజ్‌కుమార్ తన గ్యాంగ్‌ను పిలిపించాడు. దీంతో ఘర్షణ తీవ్రతరమైంది. దాడి నుంచి ప్రియుడ్ని కాపాడుకోవడం కోసం ప్రీతి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారం పాటు రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో రాజ్‌కుమార్, ప్రీతి స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…