Trends

ఇద్దరు కూతుళ్లకు రెండో భర్తకు పిల్లలు..ఓ తల్లి దారుణం

ఈ కలికాలంలో కామాంధులకు కొదవ లేదు. ఆరేళ్ల పసిపాప నుంచి అరవై ఏళ్ల ముసలావిడ వరకు చాలామంది మహిళలు లైంగిక బాధితులుగా ఉంటున్నారు. కొందరు మృగాళ్లయితే వావివరసలు…రక్తసంబంధాలు అన్నీ మరచి వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతుళ్ల పాలిట కాలయముడిగా, కామాంధుడిగా మారిన ఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే, తాజాగా ఓ కన్నతల్లి తన పేగుతెంచుకు పుట్టిన కూతుళ్ల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన తీరు సంచలనం రేపుతోంది.

పేగు బంధానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి దారుణంగా వ్యవహరించిన తీరు ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో షాకింగ్ గా మారింది. తన ఇద్దరు కూతుళ్లను తన రెండో భర్తకు ఇచ్చి కట్టబెట్టిన కసాయి తల్లి ఉదంతం వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవ్వక మానదు. ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో ఓ మహిళకు భర్త, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో, తన మేనత్త కుమారుడిని రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేదంటే వదిలేస్తానని అతడు బెదిరించసాగాడు. అలా కొన్నేళ్లు గడిచినా వారికి పిల్లలు కలగలేదు. ఈ క్రమంలోనే తన మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు యుక్త వయస్సుకు వచ్చారు. దీంతో, తన కూతుళ్లతోనే పిల్లలను కనాలని రెండో భర్తను ఆమె కోరింది.

వావి వరసలు మరిచిన ఆమె భర్త…17 ఏళ్ల పెద్ద కుమార్తెతో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో, 2017లో ఆ అమ్మాయి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, మగ పిల్లాడు కావాలని అతడు పట్టుబట్టడంతో తన రెండో కుమార్తెనూ భర్తకు ధారాదత్తం చేసింది. 2022లో మగ శిశువు పుట్టి చనిపోయాడు. ఇటీవల భర్తతో విభేదాలు వచ్చి ఆమె విశాఖపట్నం వెళ్లింది. ఈ సమయంలో గ్రామంలోనే ఉన్న చిన్న కుమార్తె…తన మిత్రుడైన ఓ యువకుడికి విషయం చెప్పింది. చివరకు ఆ విషయం పిల్లల మేనమామకు తెలియడంతో ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు…విచారణ జరుపుతున్నారు.

This post was last modified on July 14, 2023 6:04 pm

Share
Show comments
Published by
Satya
Tags: Mom

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

8 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

9 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

9 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

10 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

12 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

12 hours ago