ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…ఈ హైటెక్ జమానాలో ఈ టెక్నాలజీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో రకాల ఆవిష్కరణలు పురుడుపోసుకుంటున్నాయి. ఇంటి పనులు మొదలు భారీ పరిశ్రమల వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏకంగా ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించడం సంచలనం రేపుతోంది.
ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. జూలై 9న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ ‘లిసా’ను ఆవిష్కరించింది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ చిట్టి న్యూస్ యాంకర్ చిట్టి పొట్టి పలుకులు పొల్లుపోకుండా పలుకుతోంది. అచ్చ ఒడిశా సంప్రదాయ చేనేత చీరలో తళుక్కున మెరుస్తూ మామూలు యాంకర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా వార్తలు చదువుతోంది. రెండు చేతులు కట్టుకొని నిల్చున్న లిసా…పర్ ఫెక్ట్ లిప్ మూమెంట్ తో వార్తలు చదువుతోంది.
OTV నెట్‌వర్క్ టెలివిజన్ అండ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒడియా, ఇంగ్లీష్ రెండు భాషట్లో వార్తలను చదవడానికి లిసాను ప్రోగ్రాం చేశారు. లిసా పలు భాషలు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ, ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలను మాత్రమే చదవనుంది. ఒడియా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో లిసా ఓ సంచలనం అని, ఓ మైలురాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు.
అయితే, చూడచక్కగా వార్తలు చదువుతున్న లిసా వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లిసా ఎంత బాగా వార్తలు చదివినా…మామూలు యాంకర్లకు సరిసాటి రాదని అంటున్నారు. హావభావాలు యాంకర్ల మాదిరిగా ఉన్నప్పటికీ మనుషులు చదివినట్లుగా వార్తలు చదవలేదని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్ తరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధార పడాల్సిందేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లిసా లాంటి వాళ్లు మహిళా న్యూస్ యాంకర్లకు ఎసరు పెట్టడం ఖాయమని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on July 10, 2023 9:25 pm
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…