గతంతో పోలిస్తే కొంతకాలంగా భారత్ లో మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ టోర్నీని మహిళల క్రికెట్లో కూడా ప్రవేశ పెట్టడంతో కొత్తతరం మహిళా క్రికెటర్లు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటి ఎంతోమంది యువ మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు టీమిండియా తలుపుతడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9 నుంచి బంగ్లాదేశ్ లో పర్యటించనున్న టీమిండియా జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు చోటు దక్కించుకున్నారు.
జూలై 9 నుంచి బంగ్లాదేశ్ లో టీమిండియా మహిళల జట్టు పాల్గొననుంది. మీర్ పూర్ లో జూలై 9, 11,13వ తేదీలలో టీ20 మ్యాచ్ లు, జూలై 16, 19, 22 వ తేదీలలో 3 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో పర్యటించే మహిళల జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలు స్థానం దక్కించుకున్నారు. చాలాకాలంగా నిలకడగా రాణిస్తున్న మేఘన టీ20 జట్టులో తన స్థానాన్ని నిలుపుకుంది. ఇక, మరో తెలుగు అమ్మాయి, పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి వన్డేతో పాటు టీ20 జట్టుకు కూడా ఎంపికైంది. మరోవైపు, స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష కూడా వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు ఎంపికైంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ నుంచి బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ల కోసం జట్లను ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలకు చోటు దక్కడం విశేషం.
చాన్నాళ్ల నుంచి జట్టులో ఉన్న సబ్బినేని మేఘన టీ20 జట్టులో చోటు నిలుపుకొంది. పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి రెండు జట్లకు ఎంపికైంది. స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చింది. ఆమె కూడా రెండు జట్లలో చోటు దక్కించుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత మహిళలు మీర్పూర్ వేదికగా ఈ నెల 9, 11, 13వ తేదీల్లో మూడు టీ20లు, 16, 19, 22వ తేదీల్లో మూడు వన్డేల్లో బంగ్లాతో తలపడనున్నారు.
This post was last modified on July 3, 2023 4:03 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…