వందల మంది ప్రాణాల్ని తీసిన ఒడిశా విషాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 278 మంది మరణించగా.. అందులో 40 మంది కేవలం కరెంట్ షాక్ తో మరణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు.
ఈ ఉదంతంపై కొందరు అధికారులు చెబుతున్నదేమంటే.. ‘గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిన తర్వాత ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు పక్కనున్న ట్రాక్ మీద పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద బెంగళూరు – హౌవ్ డా రైలు వెళుతుండగా చివరి నాలుగు బోగీలపై బోగీలు పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్ హెడ్ లో టెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీల మీద పడ్దాయి. దీంతో విద్యుద్ఘాతం చోటు చేసుకుంది’’ అని వివరించారు.
బోగీల మధ్య చాలా మంది నలిగిపోవటంతో డెడ్ బాడీలను గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైనట్లు చెబుతున్నారు. అయితే.. 40 డెడ్ బాడీల మీద ఎలాంటి గాయాలు లేకపోవటాన్ని గుర్తించారు. వారి పోస్టుమార్టం రిపోర్టులో వారంతా కరెంటు షాక్ కు గురై చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కుట్ర ఆరోపణల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నేడు ఘటనాస్థలానికి వెళ్లిన అధికారులు దర్యాప్తు షురూ చేశారు.
This post was last modified on June 6, 2023 6:41 pm
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…