2020 మే 8.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావడం కోసం మొదలుపెట్టిన బృహత్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు తొలి విమానం వచ్చింది. ఆ విమాన పైలట్లకు కోళికోడ్‌లో ఘన స్వాగతం లభించింది. అందులో అఖిలేష్ కుమార్ కూడా ఒకడు. కరతాళ ధ్వనులతో అతడిని స్వాగతించారు.
కరోనా ముప్పును పట్టించుకోకుండా విధులు నిర్వర్తించడమే ఆ ప్రశంసలకు కారణం. ఆ తర్వాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అతను వందే భారత్ మిషన్లో భాగంగా ఎయిర్ ఇండియా సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు వచ్చిన విమానంలోనూ అతను ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది.
170 మందికి పైగా ప్రాణాలు కాపాడి.. పైలట్ దీపక్ సాథెతో పాటు కో పైలట్ అయిన అఖిలేష్ కూడా ప్రాణాలు విడిచాడు. మూడు నెలల కిందట సాదర స్వాగతం అందుకుంటూ సగర్వంగా విమానం నుంచి బయటికి వచ్చిన అఖిలేష్ ఇప్పుడు విగత జీవుడై బయటికి రావడం అందరినీ కలచి వేస్తోంది.
దీనికి మించిన బాధాకరమైన విషయం ఏంటంటే.. అఖిలేష్ భార్య మేఘా ఇంకో రెండు వారాల్లో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె అఖిలేష్ మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో బిడ్డను సంతోషంగా ఈ లోకంలోకి ఆహ్వానించాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు అఖిలేష్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అఖిలేష్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని మథుర. 2017లో అతను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ‘ఫస్ట్ ఆఫీసర్’గా చేరారు.
This post was last modified on August 10, 2020 3:10 pm
2025 సంక్రాంతికి ఖరారుగా వస్తున్న సినిమాలు నాలుగు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పక్కా ప్లానింగ్ తో…
కొన్ని క్రేజీ కలయికలు తెరమీద చూడాలని ఎంత బలంగా కోరుకున్నా జరగవు. ముఖ్యంగా మల్టీస్టారర్లు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్…
పవన్ కళ్యాణ్ ఎంత పవర్ స్టార్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతతో కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తూ నిత్యం…
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం వల్ల వెంటనే లైవ్ చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. అక్కడ…
ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో…