Trends

రైలుపట్టాలపై రక్తపాతం: 250 మందిని బలి తీసుకున్న ప్రమాదం అసలెలా?

ఇప్పటి వరకు విన్న రైళ్ల ప్రమాదాల్లోకెల్లా అత్యంత దారుణ.. విషాదభరితమైన రైలు ప్రమాదం శుక్రవారం రాత్రిచోటు చేసుకుంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీ కొన్న ఈ షాకింగ్ ఉదంతంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని కలిగించింది. ఎన్నో వందల కుటుంబాలను శోకంలోకి ముంచెత్తింది. ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రజలకు సుపరిచితమైన రైళ్ల పేర్లలో కోరమండల్ ఎక్స్ ప్రెస్. పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ఈ ట్రైన్ నడుస్తుండగా.. ఏపీలోని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న భారీ రైలు లైన్ లో ఈ ట్రైన్ పరుగులు తీస్తూ ఉంటుంది. అలాంటి ఈ ట్రైన్ శుక్రవారం రాత్రి ఒడిశాలో తీవ్ర ప్రమాదానికి గురి కావటం తెలిసిందే. వేగంగా వెళుతున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీ కొనటంతో రైలు బోగీలు ట్రాక్ మీద పడ్డాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్రాక్ మీద పడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల్ని ఢీ కొని పట్టాలు తప్పి.. బోగీలు తిరగబడ్డాయి.

దీంతో.. ఆ ప్రాంతమంతా ప్రయాణికులు హాహాకారాలతో.. అసలేం జరుగుతుందో అర్థం కాని దుస్థితి. రాత్రి వేళలో ప్రమాదం చోటు చేసుకోవటంతో.. చుట్టూ చిమ్మ చీకటి. అసలేం జరుగుతుందో అర్థం కాని దుస్థితి. అయినోళ్లు కనిపించక కొంతమంది.. అప్పటివరకుతమతో ఉన్న వారు ప్రాణాలు విడిచిన వైనంతో షాక్ చెందిన పరిస్థితి. తాజాగా అందుతున్న సమాచారం (శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో) ప్రకారం ఈ దారుణ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. ఈ మరణాలు మరింత పెరిగి 250కు పైనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇదే ప్రమాదంలో మరో 900 మంది గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

శుక్రవారం రాత్రి7.20 గంటలకు చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ 15 బోగీలు 15 కోచ్ లుపట్టాలు తప్పగా.. వాటిల్లో ఏడు తిరగబడ్డాయి. కాసేపటికే రెండో ట్రాక్ మీద హౌరాకు వెళుతున్న బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రరెస్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీల్ని ఢీ కొనటంతో ఆ ట్రైన్ కు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుల్ని బయటకు తీసి.. ఆసుపత్రులకు తరలించటం చాలా కష్టంగా మారింది.ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకున్నంతనే రైల్వే అధికారులతో పాటు.. స్థానికులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు.

ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే తమిళనాడు ముఖ్యమంత్రిస్టాలిన్ స్పందించి.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఫోన్ లో మాట్లాడారు. అంతేకాదు.. తమిళుల్ని కాపాడేందుకు వీలుగా రాష్ట్ర మంత్రి శివశంకర్ ను.. మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఒడిశాకు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి.. తమ రాష్ట్ర మంత్రి మానస్ భునియా.. ఎంపీ డోలా సేన్ లతో కూడిన ఒక టీంను ఒడిశాకు పంపుతున్నట్లుగా వెల్లడించింది. ఈ ప్రమాదం నేపథ్యంలో మొత్తం 18 ఏళ్లను రద్దు చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (శనివారం) గోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగాల్సిన గోవా – ముంబై వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవాన్ని రద్దు చేశారు. ఇంతకీ ఈ ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రైల్వే అధికారుల అంచనా ప్రకారం.. బహనాగ రైల్వేస్టేషన్ వద్ద స్టాప్ లేకపోవటంతో వేగంగా వెళుతున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పి.. పక్కనున్న ట్రాక్ మీద పడినట్లుచెబుతున్నారు. అయితే.. ఆ వాదన సరికాదని చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్ష్యుల వాదన మరోలా ఉంది.

‘‘బహనాగ స్టేషన్ లో స్టాప్ లేనప్పుడు రైలుకు మొయిన్ లైన్ లో ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అలాంటిది కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు లూప్ లైన్ లో సిగ్నల్ ఎలా ఇచ్చారు? మొయిన్ లైన్ లోకి వెళ్లకుండా లూప్ లైన్ లోకి రావటంతో అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొనటమే ప్రమాదానికి అసలు కారణం’’ అని చెబుతున్నారు. రైల్వే అధికారుల ప్రకటన మరోలా ఉంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని చెబుతున్నారు. మొత్తంగా ఈ దారుణ ప్రమాదంలో నిర్లక్ష్యం.. తప్పుగా సిగ్నల్ ఇవ్వటమే కారణమన్న మాట బలంగా వినిపిస్తోంది.

This post was last modified on June 3, 2023 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

34 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

7 hours ago