విన్నంతనే ఒళ్లు జలదరించే ఈ ఉదంతం పంజాబ్ లో చోటు చేసుకుంది. అమ్రత్ సర్ జిల్లా ఫగ్వారాకు చెందిన పన్నెండేళ్ల బాలిక.. చిన్నారికి జన్మనిచ్చింది. తాను గర్భవతినన్న విషయం ఆ చిన్నారికి అప్పటివరకు తెలీకపోవటం గమనార్హం. నిజానికి ఆమె ఏడు నెలల క్రితమే గర్భం దాల్చినా.. అభంశుభం తెలియని ఆ పాపకు తెలీదు. తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆమెను గురునానక్ దేవ్ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంగా..పాప గర్భవతి అన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు.
ఆ వెంటనే ఆమెకు ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. అయితే.. తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైద్యులు అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. తన కుమార్తె గడిచిన ఏడు నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతున్నట్లుగా ఆమె తండ్రి వైద్యులకు చెప్పారు.
నొప్పి అన్నప్పుడల్లా తాను మందు తెచ్చి ఇచ్చేదానినని.. ఆసుపత్రికి వచ్చిన తర్వాతే ఆమె గర్భవతి అన్న విషయం తెలిసిందని చెప్పారు. ఇంట్లో తామిద్దరమే ఉంటామని.. తన భార్య తనను వదిలి వెళ్లినట్లుగా బాధితురాలి తండ్రి చెప్పుకొచ్చారు. దీంతో.. అసలేం జరిగిందన్న విషయాన్ని బాధితురాలిని ప్రశ్నించగా.. ఏడు నెలల క్రితం తాను బహిర్భూమికి వెళ్లినప్పుడు తనపై లైంగిక దాడి జరిగినట్లుగా చెప్పింది. దీంతో.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదంతం గురించి విన్నంతనే.. ఇంత దారుణానికి పాల్పడిన వాడిని అస్సలు వదిలిపెట్టకూడదని మాత్రం అనిపించక మానదు. దేవుడా.. వాడిని మాత్రం వదిలిపెట్టకు.
This post was last modified on May 28, 2023 9:59 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…