నిన్న అమెరికా.. ఇప్పడు బ్రిటన్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి సమీపంలో ట్రక్కు దాడి మరవకవముందే.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసంపై కూడా ఈ తరహా ఘటన జరగడం కలకలం రేపింది. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేట్‌ను.. ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టడం సంచలనంగా మారింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.20 సమయంలో జరిగిందని వెల్లడించా రు. అయితే ఇది ఉగ్ర కుట్ర కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును కారు ఢీకొన్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ వీధిలో వాహనాల రాకపోకలను నిలిపివేసి.. ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని తనిఖీలు చేపట్టారు. అనుమానించాల్సిన పరిస్థితి కనపడకపోవడం వల్ల దిగ్బంధాన్ని తొలగించారు.
కారు దాడి జరిగిన సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన కార్యాలయంలో ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన కొద్ది సమయం వరకూ అధికారులెవరూ బయటకు రావొద్దని పోలీసులు ఆదేశించారు. బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ముందు ఎల్లవేళలా గట్టి బందోబస్తు ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. బ్రిటన్ పార్లమెంట్‌కు 10 డౌనింగ్ స్ట్రీట్ షార్ట్‌కట్ మార్గం. డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశంలో 1989లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు.
అప్పట్లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్‌లో బాంబు దాడులకు పాల్పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. 1991లో అప్పటి ప్రధాని నివాసంపై మరోసారి మోర్టార్ షెల్స్‌తో దాడి జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. రక్షణ వలయంగా భారీ గేట్లు, భద్రతా సిబ్బంది ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ మార్గంలోకి కారు వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే తాజా ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on May 26, 2023 10:46 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…